Sleep Tips : రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!!

Sleep Tips : ఇటీవల కాలంలో యువత తమకు నచ్చిన పనిచేస్తూ ముఖ్యంగా రాత్రి సమయంలో వృధాగా సమయాన్ని గడిపేస్తున్నారు. ఇక టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో పబ్, పార్టీ, సెల్ ఫోన్, టీవీ అంటూ వృధాగా సమయాన్ని వృధా చేస్తూ రాత్రులు సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. పైగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడంతో మరెన్నో రోగాలు తలెత్తే అవకాశం ఉంది . ఇటీవల కాలంలో చాలా మంది రాత్రి పూట నిద్ర సరిగా పట్టడం లేదు అంటూ వాపోతున్నారు. ఇలా రాత్రులు సరిగ్గా నిద్ర పోవాలి.. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడి లేని జీవితం

తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి తప్పకుండా అవసరం అవుతాయి.నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగిస్తే చక్కగా నిద్రపడుతుంది. మీరు కానీ మీలో ఎవరైనా కానీ ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లైతే ఈ ఆర్టికల్ను వాట్సప్ ద్వారా షేర్ చేసి ఉపయోగ పడవచ్చు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలామంది మానసికంగా ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే వారికి నిద్ర పట్టడం లేదు అనే ఒక కంప్లైంట్ కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

you know national sleep foundation recommends these tips for better sleep
you know national sleep foundation recommends these tips for better sleep

ఇక చాలామంది డైటింగ్ పేరుతో ఎంత ఆకలిగా ఉన్నా సరే కేవలం తక్కువ మోతాదులో మాత్రమే ఆహారం తీసుకుంటారు . అలా తీసుకోవడం వల్ల నిద్రపట్టకపోవడం తో పాటు మరెన్నో సమస్యలు తలెత్తుతాయి.ఇక సరిగా తినకపోవడం కూడా నిద్రపై ప్రభావం పడుతుంది. డైటింగ్ చేసే వాళ్ళు ఆయా సీజన్లలో లభించే పండ్లను కడుపునిండా తిని నిద్ర పోవాలి. అలాగే గ్లాసు పాలలో బెల్లం కలుపుకుని తాగితే నిద్ర పడుతుంది. అలాగే నిద్రపోవడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. పడుకొనే రెండు గంటల ముందు కడుపునిండా తినాలి. అలాగే పడుకుని గంట ముందే ఫోన్ , టీవీ లాంటివి చూడకపోవడం మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మీకు రాత్రిపూట చాలా బాగా నిద్ర పడుతుంది