Jobs : తెలుగు రాష్ట్రాల్లో 4775 పోస్టులు ఖాళీలు..ఇలా అప్లై చేయండి..

Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తోంది. గత కొద్ది రోజుల క్రితమే గ్రూప్స్ ఉద్యోగాలు విడుదల చేయగా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన వారిగా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

4775 posts vacant in Telugu states Apply like this
4775 posts vacant in Telugu states Apply like this

1). మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్ట్లు కలవు:
ఇందులో జిల్లాల వారీగా ఖాళీలు ఏవంటే విశాఖపట్నం-974, రాజమండ్రి-1446, కడప-1368, గుంటూరు-967 పోస్టులు కలవు.

2). అభ్యర్థుల వయస్సు : ఆసక్తి కలిగిన అభ్యర్థులు , అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

3). జీతభత్యాలు : అభ్యర్థులు ఈ పోస్టులకు ఎంపికయినట్లు అయితే నెలకు రూ.15,000 రూపాయల నుంచి రూ.52,000 రూపాయల వరకు జీత భత్యం చెల్లిస్తారు.

4). అర్హతలు : అభ్యర్థులు బిఎస్సి నర్సింగ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిలింగ్ లోరిజిస్ట్రేషన్ కూడా అయి ఉండాలి.

5). ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

6). దరఖాస్తు ఎలా అప్లై చేసుకోవాలంటే : అభ్యర్థులు ఈ పోస్టులకు కేవలం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి.

7). దరఖాస్తు చివరి తేదీ : అభ్యర్థులు దరఖాస్తు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 16-2022

8). అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://cfw.ap.nic.in/ సంప్రదించాలి.

మీరు కానీ.. మీ బంధువులు కానీ.. స్నేహితులు ఇలా ఎవరైనా సరే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నట్లు మీకు అనిపిస్తే వెంటనే ఈ ఆర్టికల్ ను వారికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి అంతేకాదు ఈ ఆర్టికల్ వారికి ఉపయోగపడవచ్చు. ఇలాంటి మంచి మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఈ ఆర్టికల్ ను షేర్ చేస్తూనే ఉండండి.