మీకు ఇష్టమైన రంగు మీ స్వభావాన్ని తెలుపుతుందని మీకు తెలుసా…

సాధారణంగా ఎవరైనా సరే రంగులు ఏంటి .. మన స్వభావాన్ని తెలియజేయడం ఏంటి.. అనే ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఇక మానవ మనస్తత్వ శాస్త్రాన్ని కొలవడానికి రంగు అనేది కూడా ఒక అద్భుతమైన సాధనం అట. అలాగే రంగు అనేది కూడా మానవ హృదయంలో భావోద్వేగాలను సృష్టిస్తుంది. దీని నుంచి అనుభవం పొందిన వ్యక్తులు ఇతరుల మనస్సును అర్థం చేసుకోగలరు. రంగుల ఎంపిక విషయంలో ఒక్కొక్కరి కి భిన్నాభిప్రాయాలు ఉంటాయి.కొందరికి అన్ని రంగులు నచ్చితే మరికొంతమందికి ఒకటి లేదా రెండు రంగులు మాత్రమే నచ్చుతూ ఉంటాయి.ముఖ్యంగా వేసుకొనే బట్టల నుంచి ఉండే ఇంటి వరకు ప్రతి ఒక్కటి ఆకర్షణీయమైన రంగులతో తీర్చి ద్ధిద్దుకుంటూ ఉంటారు లేకపోతే ఏ రంగు ఎలాంటి స్వభావాన్ని సూచిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం.

Did you know that your favorite color reflects your temperament
Did you know that your favorite color reflects your temperament

1.ఎరుపు: ఎరుపు ఎన్నో సందర్భాలలో అత్యంత ఆకర్షణీయమైన రంగు గా పరిగణించబడుతుంది. అంతేకాదు చాలా మందికి ఇష్టమైన రంగులలో ఎరుపు కూడా ఒకటి. ఎరుపు రంగు శక్తికి ప్రతిరూపం. ఎరుపు రంగును ఇష్టపడే వ్యక్తులకు మరింత ఉత్సాహంగా, శక్తివంతంగా, నమ్మకంగా ఉంటారు. ఎప్పుడూ కూడా లోతైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. మానసిక బలం ఎక్కువ.. వేగంగా ఆలోచించగలరు అలాగే ఎక్కువగా దృఢసంకల్పంతో ఉండగలరు.

2. నీలం : చాలా విషయాలపై దృష్టి పెట్టడంతో పాటు లోతుగా ఆలోచిస్తారు. ఇక విశ్లేషణాత్మక స్వభావం కలిగి ఉంటుంది. తొందర పడకుండా ఏదైనా చేయాలి అంటే వీరికి సమయం పడుతుంది. ప్రేమలో హేతుబద్ధంగా.. నిజాయితీగా ఉంటారు. నిజం లేకపోవడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు.

3. ఆకుపచ్చ : ఈ రంగును ఇష్టపడేవారు చాలా ప్రశాంతంగా, మానసిక స్థితిలో ఉంటారు. బాగా అర్థం చేసుకునే గుణం తో పాటు ఉదారమైన వ్యక్తిత్వంను కూడా కలిగి ఉంటారు.

4. పసుపు : పసుపు రంగును ఇష్టపడేవారు మృదుస్వభావి, ఊహాత్మకంగా ఉంటారు. వీరి నిర్ణయాలకు మరొకరు విలువ కూడా ఇస్తారు . వేగంగా ఆలోచించగలరు అలాగే అభిప్రాయాలను, కలలను అణచివేయడానికి ఏమాత్రం ఇష్టపడరు.

5: తెలుగు : ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు ప్రశాంతంగా, నిర్భయంగా, ఆశావాదాంగా, సమతుల్యంగా, ప్రశాంతంగా , బలమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. వివేకవంతులు మాత్రమే కాదు దూరదృష్టి కలవారు కూడా.

6. నలుపు : వీరు తమ సంకల్పంతో చాలా బలంగా ఉంటారు. తమను తాము నియంత్రించుకుంటూ పరిసరాలను నియంత్రిస్తారు.