Beauty Benefits : ఈ పూల మొక్క గురించి ఎవ్వరికీ తెలియని రహస్యం..! తెలిస్తే తప్పకుండా పాటిస్తారు..!

Beauty Benefits : నేల గులాబీ మొక్కలు మనం మన ఇంటి చుట్టుపక్కల రోజూ చూస్తూనే ఉంటాము.. ఈ చెట్టు గులాబి పూలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి.. ఈ చెట్టును నేల గులాబీ, గడ్డి గులాబీ, నాచు గులాబీ, టేబుల్ రోజ్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.. ఈ మొక్క ఎటువంటి ప్రవేశం లోనైనా సులువుగా బ్రతకగలదు.. ఈ చెట్టు పువ్వులు ఆకులలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.. వాటి విలువ తెలిస్తే ఈ మొక్కను అస్సలు వదిలిపెట్టరు.. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది..! నేల గులాబీ లను స్వీకరించి శుభ్రంగా కడిగి వాటిని మెత్తగా దంచి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ కు కొద్దిగా తేనె కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మీద ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. వరుసగా వారం రోజుల పాటు ఈ చిట్కాను ప్రయత్నిస్తే పూర్తిగా తగ్గిపోతాయి. ఈ మొక్కలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, టానిన్స్, విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తాయి. జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ మొక్క చక్కగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమానికి కొబ్బరినూనె లేదంటే ఆలివ్ ఆయిల్ కలపాలి.

Amazing Health and Beauty Benefits Of Gaddi Gulabi Plant
Amazing Health and Beauty Benefits Of Gaddi Gulabi Plant

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఊడటం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది. గడ్డి గులాబీ మొక్క రసాన్ని గాయాలు ఉన్న చోట రాస్తే రక్తం కారకుండా అడ్డుకుంటుంది. రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. రోజు ఈ ఆకుల రసం రాస్తుంటే పుండ్లు, గాయాలు త్వరగా మానిపోతాయి. చర్మం మీద వచ్చిన పొక్కులను కూడా ఈ ఆకుల రసం తొలగిస్తుంది. ఈ చెట్టు వేరు కషాయం తయారుచేసుకొని తాగితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.