Weight loss : బరువును తగ్గించే ముఖ్యమైన సూత్రాలివే..!!

Weight loss : అధిక బరువు.. ఇటీవల చాలామంది ఎదుర్కొనే దీర్ఘకాలిక సమస్యలలో అధిక బరువు కూడా ఒకటి. అయితే ఎప్పుడు.. ఎవరు.. ఎలా అధిక బరువుకు గురి అవుతారో చెప్పడం చాలా కష్టం.. ఎంత తక్కువ తిన్నా సరే ఒక్కోసారి బరువు పెరిగి పోతూ ఉంటారు. ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. వ్యాయామం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ లాంటివి ఎన్ని చేసినా కూడా బరువు తగ్గకపోయినా మరెన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇకపోతే ప్రతి ఒక్కరికి స్థూలకాయం అనేది అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ఇష్టమైన దుస్తులను ధరించలేక.. శరీరం బరువు ను మోయలేక.. నలుగురిలో ఫ్యాషన్ గా స్మార్ట్ గా కనిపించలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే అంతర్జాలంలో మనకు ఎన్నో రకాల చిట్కాలు కనిపిస్తున్నప్పటికీ వాటిని వైద్యుల పర్యవేక్షణలో చేయకపోతే మరి ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. మరి అధిక బరువును తగ్గించుకునే మార్గాలు ఏమిటో తప్పకుండా తెలుసుకోవాలి.

లేకపోతే మరింత ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక బరువు వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి.. గుండెపోటు.. రక్తహీనత.. రక్తపోటు వంటి మరెన్నో సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అధిక బరువును నియంత్రించుకోవడానికి కావలసిన మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇకపోతే బరువు తగ్గాలని కొంతమంది కఠినమైన వర్కవుట్లు మొదలుపెడితే..మరికొంతమంది డైటింగ్ పేరుతో పూర్తిగా నోటిని కట్టేసుకుంటున్నారు. ఇక తిండి మానేసి మరి కడుపు మాడ్చుకుంటున్నారు. అధిక బరువు అనేది ఈ రోజుల్లో అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇక ఈ సమస్య అనేది.. మన లైఫ్ స్టైల్ లో మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు పెరుగుతున్నారు. ఈ బరువును తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు ఉపయోగపడతాయో మనం ఒకసారి తెలుసుకుందాం..

These are the important principles of weight loss
These are the important principles of weight loss

గుమ్మడి కాయ : గుమ్మడి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి.. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఒక కప్పు గుమ్మడికాయలో 80 కేలరీలు మాత్రమే మనకు లభిస్తాయి. గుమ్మడి కాయలలో మినరల్స్ , విటమిన్స్ పుష్కలంగా లభించడమే కాకుండా పీచుపదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కేలరీ లు తక్కువగా ఉండడం వల్ల త్వరగా ఆకలి వేయదు .బరువు పెరగకుండా చూస్తుంది. ముఖ్యంగా గుమ్మడి కాయలు లభించి పీచు పదార్ధం వల్ల మలబద్ధకం సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. బీటా-కెరోటిన్ కూడా పుష్కలంగా లభిస్తుంది . యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసే ఇది ఒంట్లో చేరిన తర్వాత విటమిన్ ఏ రూపం లోకి మారిపోయి కంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా గుమ్మడికాయలు విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు వుంటాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ ఫ్రీ , ఫ్యాట్ ఫ్రీ, సోడియం ఫ్రీ గా పనిచేస్తుంది. కాబట్టి మీ డైట్ లో గుమ్మడికాయను చేర్చుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.

పెరుగు : పెరుగులో మంచి బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అధిక బరువును కంట్రోల్లో ఉంచడానికి పెరుగు చాలా సహాయపడుతుంది . ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరదు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే పెరుగు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు . ఇందులో మినరల్స్ కూడా లభిస్తాయి పెరుగు అధికంగా జీవక్రియను మెరుగు పరిచి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజుకు 200 గ్రాములు పెరుగు తీసుకోవడం తప్పనిసరి.

శనగలు : బరువు తగ్గాలనుకొనే వారు శెనగలు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది . ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహారంపై ఆసక్తి తక్కువ అవుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అధికంగా ప్రోటీన్ ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. వీటితోపాటు పప్పుధాన్యాలు, వాల్ నట్స్ వంటివి కూడా బరువు తగ్గడంలో సహాయపడుతాయి.