Kurukshetra War : కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవ వంశాన్ని నాశనం చేసింది ఎవరు..?

Kurukshetra War : కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవ వంశాన్ని నాశనం చేయాలనుకున్న అశ్వత్థాముడు కురువంశ గురువైన ద్రోణాచార్యుడు యొక్క కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం లో ద్రోణాచార్యుడు, అశ్వత్థామ కౌరవుల వైపు ఉండి పోరాడారు. అశ్వత్థామ శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేసి ఒక కత్తిని వరంగా పొందుతాడు. ఆ తర్వాత అశ్వత్థాముని శివుడు ఆవహిస్తాడు. యుద్ధం ముగిసిన రోజు రాత్రికి పాండవులు శిబిరాలను ధ్వంసం చేసి నిద్రిస్తున్న ఉపపాండవులను,ఏనుగుల సైన్యమును, అశ్వాలను, చిత్రవధ చేసి, కత్తికో కండా చేసి హతమారుస్తాడు. ఈ విషయమును చివరి శ్వాసతో ఉన్న దుర్యోధనుడికి కృతవర్మ, కృపాచార్యుడులతో కలిసి వెళ్లి చెబుతాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు సంతృప్తిగా కన్నుమూస్తాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు అతని సోదరులు, శ్రీకృష్ణుడు, సార్తకి కలిసి మాట్లాడుతుండగా దృష్టధ్యున్యుడు సారధి భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అశ్వద్ధామ ఏ విధముగా ఉపపాండవులు సంహరించాడో చెప్పగానే ధర్మరాజు గుండెలవిసేలా బాధపడతాడు.

మిగిలిన వారు ఎంత ఓదార్చిన ధర్మరాజు బాధపడుతూనే మూర్ఛపోయారు . సేవకులు నీళ్లు చల్లి లేపిన వెంటనే ధర్మరాజు ఇలా అన్నాడు. ఓ దేవుడా యుద్ధ సమయంలో ఎవరైనా చనిపోతారు. కానీ యుద్ధం అయిపోయింది కదా. యుద్ధంలో గెలిచాము కదా, సంబరాలకు సమయం ఇది కదా,అలాంటిది ఇప్పుడు ఎంతటి గర్భశోకం, ద్రౌపదికి ఏమని సమాధానం చెప్పను. తమ్ముడు,కుమారులు చనిపోయినారు అని తెలిస్తే ద్రౌపది విలవిలలాడుతుందనీ వాపోయారు. ఈ విషయాన్ని ద్రౌపదికి నకులుడు వెళ్లి చెప్తూనే పాండవసతీమణి ఇలా అంది.. మా ప్రియ పుత్రుడు అభిమన్యుడు చనిపోయిన బాధనే ఇంకా మరవలేక ఉన్నాము. ఇంతలోనే మరొక గర్భశోకమా అని తల్లడిల్లింది. దీనికి కారణమైన అశ్వర్ధామను చంపివేసి తన తలపై వున్న మణి ని తీసుకురండని భీమసేనుని కోరుతుంది. లేకుంటే నేనే చనిపోతాననీ చెబుతుంది. దీనితో భీమసేనుడు ఉగ్రరూపం దాల్చి నకులుడు సారథిగా.. అశ్వద్ధామ అడవిలోకి వెళ్ళాడు అని తెలిసి ఆ వైపుగా వెళ్తాడు. భీముడు అటుగా వెళ్తున్న వాళ్ళని అడిగితే అశ్వద్ధామడు కృపాచార్యుని,కృతవర్మ వదిలీ వ్యాసుని ఆశ్రమం వైపు వెళ్ళాడనీ దారిలో ఉన్న వారు చెబుతారు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు ధర్మ రాజుతో ఇలా అన్నాడు.

Who destroyed the Pandava dynasty after the Kurukshetra War
Who destroyed the Pandava dynasty after the Kurukshetra War

ధర్మరాజా… భీముడు ఒక్కడే నకులదేవునితో వెళ్ళాడు .అశ్వత్థాముడు గొప్ప అస్త్రాలు కలిగినవాడు. అశ్వత్థాముడు దగ్గర బ్రాహ్మశ్నిరోనామాకస్త్రం కూడా వుంది. అది ఎదిరించ లేనిది కాబట్టి మీరు కూడా వెళ్లి సహాయం చేస్తే బాగుంటుంది. ద్రోణాచార్యుడు తన కుమారుడికి ఈ బ్రహ్మాస్త్రమును ఇచ్చి ప్రజలమీద ప్రయోగించ రాదని చెప్పినా ఈ మూర్ఖుడు వింటాడా, అయినా అతనికి ప్రయోగించడం మాత్రమే తెలుసు ఉపసంహరించడం తెలియదు. ధర్మరాజా నీకు ఇంత వరకు తెలియని విషయం ఒకటి చెబుతాను విను.నా శంకుచక్రాలతో నన్నే వదించాలని చూసినవ్యక్తి అశ్వత్థాముడు. ధర్మరాజా మీరు వనవాసం లో ఉన్నప్పుడు అశ్వత్థాముడు ఒక రోజు వచ్చి మీ శంకు చక్రాలు నాకు ఇవ్వండి, మా తండ్రి ప్రసాదించిన బ్రహ్మాస్త్రం మీకు ఇస్తాను అని పలికాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు అతని అహంకారం. నేను అప్పుడు నా శంకు చక్రాలను ఇస్తాను దాని ఫలితంగా నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదులే అన్నాను. అక్కడ నా ఆయుధాలు ఉన్నాయి ఏవైనా తీసుకో అని పంపాను. చక్రాన్ని ఎడమచేతితో ఎత్తబోయాడు, కానీ ఎత్తలేకపోయాడు.

ఐనా అశ్వత్థామ ఇంత వరకు నా ఆయుధాలను నా మిత్రులు గాని, బంధువులు గాని, శివుని వరం వల్ల పాశుపతాస్రం పొందిన అర్జునుడు కానీ, నా కుమారులు గాని అడగలేదు. నీవెందుకు అడుగుతున్నావు,దీనిని ఎవరిపై ప్రయోగిస్తావు అని అడుగగా అశ్వత్థాముడు ఎవరిపై నా ఉపయోగించను శ్రీకృష్ణా నీ పై ఉపయోగించి నిన్నే నాశనం చేస్తాను అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు అతని దురహంకారం. అందుకే చెబుతున్న మీరందరు బీమసేనుడి కి సహాయం గా వెళ్ళండి. అప్పుడు ధర్మరాజు,అర్జునుడు అడవిలోకి వెళ్తారు. అక్కడ అశ్వత్థాముడు వ్యాసమహర్షి కోసం తపస్సు చేసి వరం కోరుకుంటాడు. ఆ వరం ఏమిటంటే పాండవులందరి భార్యలకు గర్భశ్రావం జరిగి పాండవులకు ఎప్పుడు సంతానం కలగకుండా శాపం ఇవ్వండి అని కోరుకుంటాడు. అప్పుడు వ్యాసమహర్షి ఇది బ్రాహ్మణుడైన నీకు మంచిది కాదు.

అయినా అందరికీ గర్భస్రావాలు జరిగే లాగా శాపం ఇచ్చిన, అభిమన్యుడు భార్య అయిన ఉత్తరకు పుట్టే సంతానమునకు గల వరం వల్ల ఏమీ చేయలేము అని అంటాడు. ఇంతలో పాండవులు అశ్వత్థామను వెతుక్కుంటూ వచ్చి తన పై బాణాలను గుప్పించి తన తలపై ఉన్న మణి ని తీసుకొని అడవిలో కుక్క చావు చావని వదిలేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు నిద్రిస్తున్న పాండవులను చంపావు కనుక నీవు కుష్ఠురోగంతో,ఆకలిదప్పులతో, మూడు వేల సంవత్సరాలు బ్రతుకు, కనీసం మనిషిలాగా కూడా ఎవరూ గుర్తించరని శపిస్తాడు. ఇక ఉత్తరకు పరీక్షిత్ అనే కుమారుడు, మరియు ఇతనికి జయమేజయుడు వాడు పుట్టి హస్తినను శుబిక్షంగా పాలిస్తారు. దీనిని చూస్తూ కుళ్ళి కుళ్ళి చావు అని శాపం ఇస్తాడు.