Karthika Deepam 23 Nov Episode : శౌర్య ఆచూకీ తెలుసుకున్న దీప.. మోనితను అస్యహించుకున్న కార్తీక్..!

Karthika Deepam 23 Nov Episode : మోనిత ఇంటి లోపల దుర్గా ఉండి మర్యాదగా నువ్వు ఎవరి తల పగలగొట్టావో చెప్పు.. అప్పుడే నీకు తాళాలు ఇస్తాను అని అంటాడు. నేను ఏం చేయలేదు అని మోనిత అంటుంది. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ కూడా అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది అని అడుగుతాడు.. దుర్గా లోపల ఉండటం చూసి కార్తీక్ మోనిత పై అనుమానం కలుగుతుంది. దుర్గ గారు మీరు ఎందుకు లోపల ఉన్నారు అని కార్తీక్ అడుగుతారు మీరు వెళ్లిపోగానే నన్ను ఇలా లోపల పెట్టి తాళాలు వేసింది. మీరు రానప్పుడు తాళాలు తీసుకుని లోపలికి వస్తానని మోనిత ప్లాన్ వేసింది కార్తీక్ సార్ అని దుర్గా చెబుతాడు. ఆ మాటలకు మోనిత ను అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్..

Karthika Deepam 23 Nov today full Episode
Karthika Deepam 23 Nov today full Episode

దీప ఇంటికి కార్తీక్ వెళ్లేసరికి లగేజ్ బ్యాగ్ తో రెడీ అవుతుంది. ఎక్కడికి వంటలక్క వెళ్తున్నావు అని కార్తీక్ అడుగుతాడు. శౌర్య ని వెతకడానికి వెళ్తున్నాను డాక్టర్ బాబు అని చెబుతుంది. ఇప్పుడు కాదులే దీప మళ్లీ వెతకచ్చు అసలే నీకు నీరసంగా ఉంది కదా అని కార్తీక్ అంటాడు. పోనీ ఈ ఒక్క రోజు ఉండు రేపు నేను కూడా నీతో పాటు వస్తాను అని కార్తీక్ చెబుతాడు. ఈరోజు నాకు సర్జరీ ఉంది అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. మీరు నాతో పాటు మీరు రావద్దు డాక్టర్ బాబు . ఇద్దరికీ అనర్ధమే తప్ప ఉపయోగం లేదు అని దీప అంటుంది. దీపకి డబ్బులు ఇచ్చి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నేను వీలు చూసుకుని వస్తాను అని కార్తీక్ చెబుతాడు.

మీకు గతం గుర్తు వచ్చేవరకు నాతోపాటు రావద్దు డాక్టర్ బాబు. మీకు గతం గుర్తొచ్చాక మీ పాపను మీరు వెతకడానికి రండి అని దీప చెబుతుంది. ఇదంతా మోనిత దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. హమ్మయ్య వంటలక్క ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కార్తీక్ ఇక నా సొంతం అవుతాడు. ఈ వంట లెక్క వచ్చేసరికి కార్తీక్ ని ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లి పోవాలి. ఎక్కడికైనా తీసుకువెళ్లడానికి ప్లాన్ చేయాలి అని మోనిత మనసులో అనుకుంటుంది.

దీప సంగారెడ్డి చేరుకోగానే ఒక ఆవిడ వచ్చి ఆ ఇంటి తాళాలు రాజ్యలక్ష్మి ఇవ్వమని చెప్పి ఇస్తుంది. ఆ ఇంటిలో కార్తీక్ ఫోటోకి దండ వేసి ఉంటుంది. అది చూసి దీప ఏడుస్తూ ఆవిడ ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆవిడ ఎవరో కూడా కనిపించదు. డాక్టర్ బాబు ఫోటోకి దండ వేసింది అంటే ఆవిడకి డాక్టర్ బాబు ఎవరో తెలుసు అంటే నేను డాక్టర్ బాబు భార్యని కూడా ఆవిడకి తెలిసే ఉంటుంది. అంటే ఇదంతా ఎవరైనా కావాలని చేస్తున్నారా అని దీప మనసులో అనుకుంటుంది.

మరోవైపు శౌర్య ఫోటోను చూపిస్తూ ఆ ఊరంతా వెతుకుతుంది. ఇక శౌర్య నాకు ఎప్పటికీ దొరకదు అని దీప దీలా పడిపోయి కూర్చుని ఉంటుంది. అప్పుడే గాలికి ఎగురుకుంటూ వచ్చి సౌర్య అంటించిన పేపర్ కనిపిస్తుంది. అమ్మానాన్న ఎక్కడున్నా రావాలి అంటూ తన ఫోటో ఉన్న పేపర్ దీప దగ్గరకు వస్తుంది . ఆ పేపర్ ని చూసి ఏడుస్తూ నేను నీకోసం వెతుకుతున్నట్టే.. నువ్వు మా కోసం వెతుకుతున్నావా శౌర్య.. నువ్వు ఎక్కడున్నా కచ్చితంగా నేను వెతికి పట్టుకుంటాను అని ఆ పేపర్ మీద ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. దీప ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.