Guppedanta Manasu 23 Nov Episode : మహేంద్ర కార్ కి యాక్సిడెంట్.! దేవయాని ప్లాన్ ఆ ఇది.!? రేపటికి సూపర్ ట్విస్ట్.!

Guppedanta Manasu 23 Nov Episode మహేంద్ర వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తాడు. డాడ్ మీరు వెళ్ళాలి అని అనుకుంటే నేను ఆపును.. మీరు ఇక మళ్ళీ నా దగ్గరకు తిరిగి రావాలి అంటే రేపు ఉదయం వరకు ఆలోచించుకోండి. ఈరోజు రాత్రంతా బాగా ఆలోచించుకొని రేపు ఉదయం సూర్యోదయం కాకముందే నా దగ్గరకు రండి అని రిషి అంటాడు.. మహేంద్ర వెళ్తుండగా రిషి గట్టిగా హత్తుకుంటాడు. మహేంద్ర మాత్రం తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు.

Advertisement

ఇక మహేంద్ర ఇంటికి వెళ్లి ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను అని జగతితో అంటాడు. నేను ఇందాకే నీతో పాట ఇంటికి వస్తాను రిషి అని చెప్పేలోపే రిషి కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక రేపొద్దు వరకు ఆగటం నావల్ల కావడం లేదు జగతి అని మహేంద్ర అంటాడు. భయపెట్టేసావు కదా మహేంద్ర. హమ్మయ్య అయితే మనం రిషి దగ్గరికి వెళ్లడం ఖాయం నాకు కూడా అస్సలు నిద్ర పట్టడం లేదు. నేను ఇప్పుడే రెడీ అయి కూర్చుంటాను అని జగతి కూడా అంటుంది.

Advertisement
guppedanta-manasu-23-nov-today-full-episode
guppedanta-manasu-23-nov-today-full-episode

వసుధర రిషి ని బాల్కనీలోకి రమ్మని మెసేజ్ చేస్తుంది. డాడ్ కోసం ఇన్ని రోజులు ఆగాను కానీ.. రేపొద్దున వరకు ఎదురుచూడకుండా ఉండలేకపోతున్నాను వసుధర.. డాడ్ తప్పకుండా వస్తారంట అని ఆవేదనతో రిషి వసుధారతో అంటాడు.
రిషి వసుధార ఇద్దరూ బాల్కనీలో మాట్లాడుకుని చేతిలో చేయి వేసుకొని కలిసిన నడుచుకుంటూ కిందికి రావడం దేవయాని చూస్తుంది. వెంటనే ఏంటి నాన్న రిషి ఇప్పటివరకు ఎందుకు పడుకోలేదు అని అడుగుతుంది. నువ్వు కూడా నిద్రపోకుండా కబుర్లు చెబుతున్నావా అంటూ వసుధార మీద ఫైర్ అవుతుంది దేవయాని. నేనే బాల్కనీలోకి వెళ్తే వసుధార వచ్చింది పెద్దమ్మ అని రిషి కవర్ చేస్తాడు. అయినా మహేంద్ర వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడానికి ఏముంది రిషి.. వాళ్ళు రావాలి అనుకుంటే వస్తారు లేదు అంటే లేదు. దానికోసం నీ నిద్రను ఎందుకు పాడు చేసుకుంటావు అని దేవయాని అంటుంది. వాళ్లు కచ్చితంగా వస్తారు మేడం అని వసుధర గట్టిగా చెబుతుంది.

వాళ్లు వస్తే శుభవార్త ఒకవేళ రాకపోతే అని దేవయాని అనగానే.. పెద్దమ్మ ప్లీజ్ అలా అనకండి అని రిషి అంటాడు. డాడ్ వాళ్ళు కచ్చితంగా వస్తారు. రిషి నీకు మనుషుల మనస్తత్వాలు అర్థం కావు. పదా నిద్రపో అని దేవయాని అంటుంది. మన మనసులోని భావాలు అందరికీ అర్థం కావులే సార్ అని వసుధర అంటుంది. ఆ మాటతో దేవయానికి సూపర్ పంచ్ వేసింది. పెద్దమ్మ మీరు వెళ్లి పడుకోండి అని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతడు. రేపొద్దున మహేంద్ర జగతి మేడం లా రాకతో ఈ ఇల్లు పులకరిస్తుంది. గుడ్ నైట్ మేడం అని వసుధార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో ఊహించని ట్విస్టులు ఉన్నాయి. మహేంద్ర జగతి ఇద్దరూ రిషి దగ్గరికి రావడానికి బయలుదేరుతారు. అప్పుడే మహేంద్ర నేను ఏమైనా తప్పు చేశానా ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి ఎన్ని రోజులు నా ప్రయత్నాన్ని వృధా చేస్తున్నానా అని అంటాడు. ఇక ఎవరో కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయినట్టు కనిపిస్తుంది. అది జగతీ మహేంద్ర నా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ మహేంద్ర జగతికి కనుక యాక్సిడెంట్ అయితే ఇదంతా దేవయాని కుట్ర లేకపోతే మరింకేదైనా అనేది తెలియాలి. యాక్సిడెంట్ అయింది అని గౌతమ్ దేవయానికి ఫోన్ చేస్తాడు. తను కాల్ కట్ చేస్తుంది. రిషికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడు. వసుధర తో కలిసి మహేంద్ర జగతి వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

Advertisement