Business Idea : ఎప్పటినుంచో దాచుకున్న డబ్బులతో చేయదగ్గ బెస్ట్ వ్యాపారం ఇది.. మూడు నెలల్లో లక్షాధికారి అవ్వడం గ్యారెంటీ!

Business Idea : ఇటీవల కాలంలో చాలామంది ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. తామే సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ముందడుగు వేస్తున్నారు. సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్న ఏ వ్యాపారం చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఈ బిజినెస్ ఐడియా. అదే ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి తక్కువ స్థలం తక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. దీనివలన తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఇటువంటి వ్యాపారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బూడిదతో తయారుచేసిన ఇటుకలకు ఎల్లప్పుడు డిమాండ్ పెరుగుతుంది. దీనికి రానున్న రోజుల్లో కూడా డిమాండ్ బాగా పెరగబోతుంది. బూడిదతో తయారుచేసిన ఇటుకలను పట్టణీకరణ బిల్డర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

దీనికోసం మీకు 100 గజాల స్థలం అవసరం. పెట్టుబడి రెండు లక్షల వరకు పెట్టాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీకు ప్రతినెల రూ.1 లక్ష వరకు ఆదాయం వస్తుంది. ఇటుకలను తయారు చేయడం ఎలా: ఈ ఇటుకలను సిమెంటు, బూడిద మరియు రాతి దూళి మిశ్రమం నుంచి తయారు చేస్తారు. వీటిని తయారు చేయడానికి ఉపయోగించే మాన్యువల్ యంత్రాన్ని 100 గజాల స్థలంలో అమరచవచ్చును. దీనివలన ఈ బిజినెస్ చేయడానికి ఎక్కువ స్థలం అవసరం ఉండదు. ఈ యంత్రాన్ని నడపడానికి 5 నుంచి 6 మంది కార్మికులు అవసరమవుతారు. దీని కారణంగా ప్రతిరోజు 3000 ఇటుకలు తయారు అవ్వడం జరుగుతుంది. మీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ధనం ఉన్నట్లయితే ఆటోమేటిక్ మిషన్ ని కూడా మీరు ఇన్ స్టాల్ చేసుకోవచ్చును. దీని ధర 10 నుండి 12 లక్షల వరకు ఉంటుంది.

Ash Bricks business is guaranteed to become a millionaire
Ash Bricks business is guaranteed to become a millionaire

బ్రిక్స్ తయారీ నుంచి ముడి సరుకును కలపడం వరకు అన్ని యంత్రం ద్వారానే జరుగుతాయి. ఒక గంటలో వెయ్యి ఇటుకల వరకు ఆటోమేటిక్ యంత్రం తయారు చేయడం జరుగుతుంది. దీనివలన 3 నుంచి 4 లక్షల వరకు ఇటుకలను ఒక నెలలో ఈజీగా తయారు చేయవచ్చును. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో మట్టి ఉండదు కనుక అక్కడ బ్రిక్స్ తయారు చేయడం లేదు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుండి ఇటుకలు ఇక్కడికి దిగుమతి చేస్తారు. దీని కారణంగా సిమెంటు రాళ్ల పొడి బూడిద తో చేసిన ఇటుకలను ఆయా ప్రాంతాలలో విక్రయించే ఛాన్స్ ఉంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి తక్కువ పెట్టుబడి తక్కువ స్థలం అవసరం అవుతుంది కాబట్టి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్పవచ్చు.