Meena : మీనా ఆ స్టార్ హీరోయిన్‌తో ర‌హ‌స్య సంబంధం కొన‌సాగించిందా.. ఇందులో నిజమెంత‌?

Meena : మీనా.. ఈ పేరు సౌత్ ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె తండ్రి తెలుగు వ్యక్తి. తల్లి మలయాళీ కాగా, ఓ బ‌ర్త్ డే పార్టీలో శివాజీ గ‌ణేష్ మీనాని చూసి అవకాశం ఇచ్చారు. అలా 1982లో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన మీనా శివాజీ గ‌ణేష‌న్ చాలా చిత్రాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా క‌నిపించి మెప్పించింది. దాదాపు 50 సినిమాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్టుగానే న‌టించి మెప్పించింది మీనా. రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ చేసిన ‘నవయుగం’ సినిమాతో మీనా హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో ‘సీతారామయ్యగారి మనవరాలు’, కోలీవుడ్‌లో ‘ఒరు పుదియ కాదల్’ సినిమాలు మీనా కెరియ‌ర్ మ‌లుపు తిప్పాయి. అప్ప‌టి నుండి ఆమె వ‌రుస అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగింది.

సాధార‌ణంగా హీరోయిన్స్‌కి సంబంధించి అనేక పుకార్లు రావ‌డం స‌హ‌జ‌మే. మీనా కెరియ‌ర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఆమె పెళ్లికి సంబంధించి చాలా ప్రచారాలు సాగాయి. సుదీప్ – మీనా రెండు సినిమాల్లో నటించగా ఈ క్ర‌మంలో వార‌ద్ద‌రు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నార‌ని పుకార్లు పుట్టించారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ తో నటి మీనా పెళ్లి అయిపోయినట్టుగా 2006లో బోలెడన్నీ వార్తలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. 2003లో తొలిసారి కలిసి నటించిన వీరిద్దరూ 2006లో ‘మై ఆటోగ్రాఫ్’ సినిమాలో నటించాడంతో, ఆ సినిమా షూటింగ్ లోకేషన్ లోనే ప్రేమలో పడి రహస్యంగా పెళ్లి చేసుకున్నారని శాండిల్ వుడ్ తెగ వార్త‌లు ప్ర‌చురించింది. ఈ సమ‌యంలో మీనా స్పందిస్తూ..

meena gives clarity on rumors
meena gives clarity on rumors

Meena : పుకార్ల‌కి చెక్..!

నాకు మీడియా మూడోసారి పెళ్లి చేసిందని.. తాను, సుదీప్ కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని.. మేం ఇద్దరం కలిసి కేవలం రెండే సినిమాల్లో నటించడం వ‌ల్ల‌నే ఇలాంటి వార్త‌లు సృష్టించి ఉంటార‌ని మీనా క్లారిటీ ఇచ్చింది. ఇక సుదీప్ కూడా ఈ విష‌యంపై స్పందిస్తూ.. మీనాతో నా రహస్య వివాహానికి సంబందించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని అన్నారు. కాగా, ఇటీవలే ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషాదం నుంచి కోలుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది మీనా . బ్రోడాడీ (మలయాళం), సన్నాఫ్‌ ఇండియా సినిమాల్లో చివరిసారిగా కనిపించిన ఆమె ప్రస్తుతం రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఓ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.