ద‌స‌రా రోజుల్లో ఈ అమ్మవారి ఫోటో అక్కడ పెట్టారంటే ఇక మీకు తిరుగుండదు..!!

ధనం మూలం మిదం జగత్ అన్నారు పెద్దలు. ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కొంతమందికి మాత్రం ఎంత శారీరిక శ్రమ చేసిన ఏది కలిసి రాకుండా జీవితాలు సాగిపోతుంటాయి. మనకి ఉన్న ఈతి బాధలు తొలగించుకోవడానికి కొన్ని దైవిక సంబంధమైన చిట్కాలను పాటిస్తే ఫలితాలు తప్పక లభిస్తాయి. వ్యాపార సంస్థలో కానీ ఇళ్లలో గాని ఒకే ఫ్రేమ్లో లక్ష్మీ గణపతి యంత్ర, సాంప్రదాయ నామ తిలకాలు, శైవ, వైష్ణవ మరియు ఓంకారం స్వస్తిక్ గుర్తులు, విజయ ఆంజనేయ పతాకం నవ శక్తుల యంత్రాలతో ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత ఫోటోతో కలిపి అన్ని ఒకే ఫోటోలో డిజైన్ చేయబడిన ” ఐశ్వర్య కాళీ” ఫోటోను దేవుని మందిరంలో కానీ, గుమ్మం పైన గాని తప్పనిసరిగా ఉంచాలి. ఈ అమ్మవారి ఫోటో పెట్టడం వలన నరదృష్టి, వాస్తు లోపాలు, శత్రు దృష్టి, కుటుంబ, గ్రహ దోషాలు, ఆర్థిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు రక్షణ కల్పిస్తారు.

” ఐశ్వర్య కాళీ” అంటే నవదుర్గల శక్తితో కూడిన సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే. ఈ అమ్మవారి ఫోటోను వ్యాపార సంస్థలలో, ఇంట్లో, ఆఫీసులలో, ఫ్యాక్టరీలలో ప్రధాన ద్వారంపై పెట్టి ప్రతినిత్యం ఎర్రని పువ్వులతో పూజించి దీప, ధూపం వేసి భక్తితో పూజించడం వలన అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతం రక్షణగా నిలిచి దుష్ట శక్తులను ఆవరణలోకి రానివ్వదు. * లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నేతితో అభిషేకం చేయడం వలన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి విగ్రహం గట్టిగా మొత్తం లోహంతో కూడి ఉండాలి. * వ్యాపార సంస్థల్లో / ఆఫీసులలో కానీ తూర్పు ముఖంగా కూర్చోవడం వలన ధన ప్రాప్తి, ధనాకర్షణ కలుగుతుంది. * పన్నీర్ లో తెల్లని వస్త్రాన్ని తడిపి ఆ వస్త్రాన్ని ఎండబెట్టి ఎండబెట్టిన వస్త్రంతో వత్తులను చేసి శుక్రవారం రోజున ఆవునేతితో ఆ మూడు వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి.

If the picture of this goddess is placed there during the Dussehra days, you will not be disappointed
If the picture of this goddess is placed there during the Dussehra days, you will not be disappointed

* గురు, శుక్రవారాలలో ఈ ఐదు పత్తి వత్తులతో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. * ప్రతిరోజు సంపుటిత సహిత శ్రీ సూక్తం చదివినవారికి అఖండ లక్ష్మి కటాక్షం కలుగుతుంది.* శ్రీ మహాలక్ష్మి స్థవాన్ని త్రీ సంధ్యలలో పటిస్తే మహా ధనవంతులవుతారు. * వైశాఖ ,చైత్రమాసాలలో శుక్ల సప్తమి రోజున శ్రీ మత్స్య పురాణంలో చెప్పిన ప్రకారం చేస్తే మహా సంపదలు కలుగుతాయి. * ప్రతిరోజు కనకధారాస్తవము త్రీ సంధ్యలలో పటిస్తే అపార సంపద చేకూరుతుంది. * లక్ష్మీదేవిని శుక్రవారం రోజున అష్టగందాలతో పూజిస్తే కీర్తి ,ప్రతిష్టలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.( కస్తూరి, కర్పూరం, జవ్వాది, పునుగు, అగరు, అత్తరు, పన్నీరు, శ్రీ గంధం)* ఉగాది తర్వాత వచ్చే శుక్రవారం రోజున మీకు ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడం ద్వారా ఆ సంవత్సరం అంతా ధనానికి ఏ లోటు ఉండదు. దీనివలన జాతకరీత్యా ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి.