Hair Tips : షాంపూలో దీన్ని క‌లుపుకుని వాడితే… మీ జుట్టు రాలడం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.

Hair Tips : ఈ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం వాతావరణంలో ఏర్పడే కాలుష్యం, అనారోగ్య కారణాలు, జుట్టుకి కావలసిన పోషకాలు అందకపోవడం. జుట్టు రాలడం తగ్గించడం కోసం మార్కెట్లో దొరికే అనేక రకాల షాంపులను, ఆయిల్స్ లను ఉపయోగిస్తుంటారు. వీటన్నిటిని ఉపయోగించకుండా మీరు వాడే షాంపులో ఇది ఒక్కటి కలిపి రాస్తే చాలు మీ జుట్టు విపరీతంగా పెరిగిపోతుంది. దీనికోసం వాటిలో మొదటి చిట్కా ముందుగా ఒక బౌల్ ని తీసుకొని దానిలో ఒక గ్లాసు నీళ్లను వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో రెండు స్పూన్ల టీ పొడిని వేసుకోవాలి. టీ పొడిని వద్దనుకునేవారు కాఫీ పౌడర్ ని కూడా వేసుకోవచ్చు.

దీనిని రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి. తరువాత నాలుగు మందార ఆకులను తీసుకొని వాటిని విడదీసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నాలుగు లేక ఐదు మందార ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. వీటిని కలిపి రంగు మారేవరకు మరిగించి తరువాత స్టవ్ ను ఆఫ్ చేయాలి. దీనిని బాగా చల్లారనివ్వాలి. తరువాత స్టైనర్ సహాయంతో వడపోసుకోవాలి. వడపోసుకున్న నీటిని ప్లాస్టిక్ బాటిల్ లో లేదా గాజు సీసాలో ఎక్కువ గా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. తల స్నానం చేసేటప్పుడు దీనిని ప్రతిరోజు ఉపయోగించి తలస్నానం చేయాలి. ఇలా వారం రోజులు చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.

Hair Tips on Tea powder in Turn on the stove
Hair Tips on Tea powder in Turn on the stove

ఎటువంటి హెయిర్ ఆయిల్స్ ని పెట్టుకోకపోయినా హెయిర్ ప్యాక్స్ ని ఉపయోగించకపోయినా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇక రెండవ చిట్కా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాసు నీళ్ళను వేసుకోవాలి. తర్వాత దానిలో రెండు స్పూన్ల మెంతులను వేసుకోవాలి. జుట్టు రాలడం తగ్గించడంలో మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నాలుగు లేదా ఐదు మందార ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి దానిని చల్లారబెట్టుకోవాలి. నీటిని వడగట్టి దీనిలో షాంపూని కలుపుకొని ప్రతిరోజు తల స్నానం చేయాలి. ఈ చిట్కాను పాటించడం వలన జుట్టు రాల సమస్య తగ్గుతుంది. అదే కాక దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.