Summer : వేసవికాలంలో తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంత మేలో..!!

Summer : వేసవి కాలం రాగానే శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి తాటి ముంజలు ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. తాటి ముంజలలో నీటి శాతం అధికంగా ఉండడమే కాకుండా కొన్ని రకాల పోషకాలు కూడా లభిస్తాయి. ఎండాకాలం మొదలైందంటే చాలు రోడ్డుకిరువైపులా తాటి ముంజల వ్యాపారులు కొనుగోలుదారుల ముందు వాలిపోతారు. అందుకే ఎక్కడ చూసినా ఈ వేసవి కాలంలో తాటి ముంజలకు మంచి డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తాటి ముంజలలో విటమిన్ బి, క్యాల్షియం, ఐరన్ , జింక్, పొటాషియం వంటి కొన్ని రకాల పోషకాలు మనకు లభిస్తాయి.

ఇక వేసవిలో శరీరానికి కావలసిన పోషకాలు ఈ తాటి ముంజల ద్వారా అంది శరీరం డీహైడ్రేట్ కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. వేసవి కాలంలో చాలా మందికి తట్టు ఎక్కువగా వస్తుంది. అలాంటి వారు తాటి ముంజలు తినడం వల్ల తట్టు రాకుండా కాపాడుకోవచ్చు. తాటి ముంజలు తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. తాటి ముంజల ను ఐస్ ఆపిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎండాకాలంలో ఎండల తాకిడి తగ్గించడానికి అందరికీ అందుబాటులో వుంటాయి.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును నియంత్రించి, బరువు ని తగ్గించే శక్తి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. వీటిలో ఉండే నీరు కడుపు నిండడం తో పాటు ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది. మలబద్ధకం, విరేచనాలు ఇలా రెండింటికి కూడా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో ఎక్కువగా వేడి తాపం తో బాధపడేవారు మీ తాటి ముంజలు తింటే దాహం తీరుతుంది. గర్భిణీ స్త్రీలు తింటే జీర్ణశక్తి పెరిగి అసిడిటీ , మలబద్ధకం సమస్య నుండి విముక్తి పొందవచ్చు. రక్తహీనత , మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ను దూరం చేసుకోవచ్చు. కడుపులో పుండ్లు, కడుపు సమస్యలు, చర్మ వ్యాధులు, కాలేయ సమస్యలు, అజీర్ణం, శక్తి లేకపోవడం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.