Potatos : బంగాళాదుంపలను వీరు అస్సలు తినకూడదట..!!

Potatos :  బంగాళదుంపలను ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు.. బంగాళాదుంపలను చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు కర్రీ ఇలా రక రకాలుగా ఆలుగడ్డ ల తో వంటకాలు తయారు చేసుకొని తింటుంటారు. బంగాళదుంప లో వుండే పోషకాలు ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి. అయితే కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్న వారు ఖచ్చితంగా బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బంగాళాదుంపలను ఉత్తర భారత దేశంలో అయితే చికెన్ లో కలుపుకొని మరీ తింటూ ఉంటారు. బంగాళాదుంపల ద్వారా మనకు విటమిన్ ఎ , విటమిన్ సి , పొటాషియం , మెగ్నీషియం , ఫాస్పరస్, జింక్ , ఐరన్ వంటి ఎన్నో ప్రయోజనకరమైన పోషకాలు లభిస్తాయి.

ఇక వీటితో పాటు కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక బంగాళదుంపలను ఇలాంటి హానికరమైన సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదట. ఇక ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు బంగాళదుంపలను తినకూడదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

Potatos :  1. ఎసిడిటీ:

బంగాళాదుంపలను క్రమం తప్పకుండా తినడం వల్ల ఎసిడిటీ సమస్య మరింత పెరుగుతుంది. దీని వల్ల కడుపులో మంట ఏర్పడే సమస్య కూడా వస్తుంది.. అంతేకాదు మరికొంతమంది కడుపు ఉబ్బరంగా అనిపించడం.. ఏది తిన్నా వికారంగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి . కాబట్టి ఎసిడిటీ తో బాధపడుతున్న వారు బంగాళాదుంపలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

2. రక్తపోటు:
బంగాళాదుంపలను తక్కువ పరిమాణంలో మాత్రమే రక్తపోటు రోగులు తీసుకోవాలి. ఇక వీటిని తినడం వల్ల రక్తపోటు అధికమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు కేవలం తక్కువ పరిమాణంలో బంగాళాదుంప లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

3. డయాబెటిస్:
షుగర్ పేషెంట్లు బంగాళదుంపలను అసలు తినకూడదు. ఎందుకంటే టైప్2 డయాబెటిస్ లేదా హై బ్లడ్ షుగర్ ఉన్న వారు బంగాళదుంప లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ అవుతాయి. కాబట్టి డయాబెటిస్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది . అందుకే బంగాళదుంపలకి దూరం గా వుండాలి.

4. ఊబకాయం:
బంగాళదుంపలలో పీచు పదార్థం అలాగే పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి . ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది . కాబట్టి బంగాళాదుంపలను తినడం వల్ల బరువు పెరిగే అవకాశం అయితే చాలా ఎక్కువ .. డైట్ తీసుకునే వారు తినకపోవడమే మంచిది.