Guava Leaves : ఈ చెట్టు ఆకులతో జుట్టు ఊడదు.. ఒత్తుగా పెరుగుతుంది..!

Guava Leaves : సామాన్యుడి ఆపిల్ గా జామపండును అభివర్ణిస్తారు..! జామ పండు మన ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే..! జామ పండే కాదు జామ ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి..! ముఖ్యంగా జామ ఆకులతో కేశాలను సంరక్షించుకోవచ్చు..! వీటిని ఏ విధంగా తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టొచ్చు చూద్దాం..!

జామ ఆకులలో విటమిన్ బి, సి ఉన్నాయి ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ పెంచడంలో సహాయపడతాయి అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. స్కాల్ఫ్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. జుట్టు రాలడానికి ప్రధానమైన కారణాలలో ఇన్ఫ్లమేషన్ కూడా ఒకటి..! జామ ఆకులు జుట్టు రాలకుండా ఉండడానికి దోహదపడతాయి. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు దురద, చుండ్రు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి.

hair Benefits in Guava Leaves
hair Benefits in Guava Leaves

జామ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి వడపోసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న జామాకుల టీ ప్రతి రోజూ తాగితే జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. జామ ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కేశాలు ఊడకుండా, నల్లగా, ఒత్తుగా పెరుగుతాయి. ఈ ప్యాక్ వలన దురద, చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.