Good News : ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ పోస్టుల భర్తీ.!!

Good News : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కటి శుభవార్తను తీసుకు వస్తోంది. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ లో తెలిపిన విధంగా పలు పోస్ట్ లను భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో గ్రూప్-1 మొత్తం 110 పోస్టులు కాగా.. గ్రూప్ -2 లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక 2020 వ సంవత్సరంలో అప్పటికి మెయిన్ పరీక్ష రాసిన అభ్యర్థులు కొనసాగించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.గతంలో హైకోర్టు కూడా ఈ ఆదేశాలకి విరుద్ధంగా ఉన్నాయని అభ్యర్థులు తాజాగా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

ఇక హైకోర్టు గతంలో తెలిపిన ప్రకారం ఐదు తప్పు ప్రశ్నల్ని సరిదిద్దిన తర్వాత కొత్తగా మెయిన్ ఎగ్జామ్ కు సంబంధించిన షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను తయారు చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు గా తెలుస్తోంది. ఇక 2021-2022 సంవత్సరంలో భర్తీ చేయవలసిన ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది ప్రభుత్వం.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. జూలై నుంచి 2022 మార్చి వరకు 10,143 పోస్టులు భర్తీ చేయనున్నట్లు గా తెలియజేశారు.

Good news for AP unemployed Replacement of group posts
Good news for AP unemployed Replacement of group posts

ఇక అంతే కాకుండా తాజా క్యాలెండర్ లో ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలో ఆ డేట్ ను కూడా ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వంలో 1.40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని, కానీ వైఎస్సార్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా 6 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలియజేశారు. ఇక ఇందులో గ్రామ సచివాలయం లో 1,22,000 ఉద్యోగాలు మిగిలినవి వాలెంటర్ల్లు రూపంలో తీసుకువచ్చామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని నోటిఫికేషన్ ను కూడా విడుదల చేస్తామని తెలిపారు.