Summer : వేసవి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే..?

summer : సాధారణంగా బయట పరిస్థితులు మారుతున్నప్పుడు చర్మంలో మార్పులు రావడం సహజం. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలం వచ్చింది అంటే శరీరం డీహైడ్రేషన్ కు గురి అయి చర్మం పొడిబారుతుంది. ముఖం మీద ముడతలు, చర్మం చికాకుగా అనిపించడం, దురద, అలర్జీలు, చర్మం నల్లగా మారిపోవడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఒక్కోసారి ముఖం మొత్తం దురదగా అనిపిస్తుంది. ఎండాకాలంలో చర్మాన్ని కాపాడుకోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.ముఖానికి ఎప్పటికప్పుడు ఆవిరిపట్టడం తప్పనిసరి.. ఎందుకంటే ముఖం పై ఉన్న రంధ్రాలు దుమ్ము , ధూళితో మూసుకుపోవడం వల్ల చర్మం అందవిహీనంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆవిరిపడితే రంధ్రాలు తెరుచుకుంటాయి పైగా చర్మం కూడా మెరిసిపోతుంది.

ముందుగా ఉదయం నిద్రలేవగానే అలాగే రాత్రి పడుకునే ముందు తప్పకుండా చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. జిడ్డు చర్మం ఉన్న వారు ఎక్కువగా ఆయిల్ ఫ్రీ క్లెన్సర్ తో చర్మాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పై పేరుకుపోయిన మలినాలు మురికి తొలగిపోతుంది.ఇకపోతే వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా గాలిలో ఉండే కణాలు కూడా చర్మం పై పేరుకుపోతాయి.. అలా పేరుకుపోవడం వల్ల మనం ఎప్పుడైతే ముఖాన్ని శుభ్రంగా కడుక్కో కపోతే .. మలినాలు పేరుకు పోయి మచ్చలకు , మొటిమలకు దారితీస్తాయి. కాబట్టి చర్మాన్ని స్క్రబ్ చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మలినాలు దూరం చేసుకోవచ్చు.

To protect the skin from the summer
To protect the skin from the summer

ఫేస్ ప్యాక్ : వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పసుపు అలాగే ఏదైనా క్రీమ్ తో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం తప్పకుండా మెరిసిపోతుంది. ముఖ్యంగా పసుపు మొటిమలను తగ్గిస్తుంది .. కాబట్టి చర్మాన్ని తేమగా ఉంచడానికి మీరు ఉపయోగించే క్రీమ్ బాగా పనిచేస్తుంది.మాయిశ్చరైజింగ్ అనేది చర్మాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక మీరు ఎప్పటికప్పుడు ఇలా ముఖాన్ని మాయిశ్చరైజింగ్ చేసే క్రీములు అప్లై చేయడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది.