Health: మండే వేసవి కాలం వచ్చింది కాబట్టి చర్మం కూడా ఎండ తాకిడికి తట్టుకోలేదు. ఫలితంగా చర్మం పొడిబారిపోవడం.. నిర్జీవంగా మారడం.. దద్దుర్లు.. పొక్కులు.. చర్మం ఎర్రగా మారడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. చర్మం పై మురికి , మృతకణాలు పేరుకుపోతాయి.. వీటిని తొలగించడానికి మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా స్నానం చేయాల్సి ఉంటుంది. కొంత మంది ఎక్కువగా స్క్రబ్బింగ్ చేస్తూ స్నానం చేస్తూ ఉంటారు . ఇలా చేయడం వల్ల చర్మానికి రాపిడి ఎక్కువై, సోరియాసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వేసవికాలంలో శారీరకంగా , మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే మొటిమలు, హైపర్ పిగ్మెంటేషన్, సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు.
Health:మండే ఎండల్లో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
సన్ స్క్రీన్:
ఇంట్లో ఉన్నా సరే తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించాలి అని చెబుతూ ఉంటారు సౌందర్యనిపుణులు. ఇక వేసవి కాలంలో అయితే తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాల్సిందే. సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాల వల్ల చర్మానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది .. అలాంటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించడం వల్ల uv కిరణాలు చర్మాన్ని తాకకుండా సన్ స్క్రీన్ లోషన్ అడ్డు పొర లాగా పనిచేస్తుంది. ఇక హైపర్ పిగ్మెంటేషన్, స్కిన్ క్యాన్సర్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.
మాయిశ్చరైజర్:
శీతాకాలం అయినా లేదా ఎండాకాలం అయిన చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. ఇక శరీరం డీహైడ్రేట్ అయితే చర్మం పొడిబారిపోతుంది .. పైగా దద్దుర్లు , చికాకు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ ను ఉపయోగించడం తప్పనిసరి..
ఎక్కువ సేపు స్నానం చేయకూడదు:
ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మానికి ఆరోగ్యకరం కాదు..
స్క్రబ్బింగ్ చేయడం ఆపివేయాలి:
స్క్రబ్ చేయడం వల్ల మృతకణాల తో పాటు చర్మంలో పేరుకుపోయిన మురికిని వదిలించుకోవచ్చు. కానీ క్రమం తప్పకుండా తీవ్రమైన స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మానికి హాని కలగవచ్చు.. రాపిడి ఎక్కువైతే ఎండాకాలంలో సోరియాసిస్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.