Bimbisara Child Artist : బింబిసారలో నటించిన ఈ క్యూట్ పాప రోజుకి తీసుకునే అమౌంట్ ఎంతో తెలుసా ? హీరోయిన్ లు కూడా పనికిరారు !

Bimbisara Child Artist : ఇటీవ‌లి కాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ గా నిలిచిన చిత్రాల‌లో బింబిసార ఒక‌టి. ఈ చిత్రం క‌ళ్యాణ్ రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌గా, తొలి ఆట నుండే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఇందులో న‌టించిన బేబి శ్రీదేవి అనే చైల్డ్ ఆర్టిస్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తో ఆ చిన్నారికి ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లో నటించడంతో ఈ అమ్మాయికి మంచి క్రేజ్ ఏర్పడింది. బిందుసారా సినిమాలో శాంభవి అనే పాత్రలో నటించి బాగానే మార్కులు కొట్టేసింది ఈ చిన్నారి.

అయితే ఇది శ్రీదేవికి మొదటి సినిమా కాదు ఇంతకుముందే మేజర్, రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాల్లో సైతం క‌నిపించి మెప్పించింది. అలానే ప్రేమ, యమలీల, కల్యాణ వైభోగమే వంటి సీరియల్స్ లోనూ ఈ చిన్నారి క‌నిపించింది. బేబి శ్రీదేవి తండ్రి శ్రీహరి గౌడ్ సైతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆమె సినిమా అవ‌కాశాలు సుల‌భంగా వ‌చ్చాయి. వీరి స్వగ్రామం బేతంచర్ల కాగా, సినిమా అవ‌కాశాల కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. శ్రీదేవి తండ్రి నటుడిగాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిన్నారికి ఇంత‌క‌ముందు సినిమాల క‌న్నా బింబిసార‌తో బాగా గుర్తింపు ద‌క్కింది.

Bimbisara Child Artist remuneration topic now
Bimbisara Child Artist remuneration topic now

తన ముద్దు ముద్దు మాటలతో క్యూట్ యాక్షన్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ చిన్నారి రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్‌ల‌లో శ్రీదేవి ఎక్కువ పారితోషికం అందుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. కొంద‌రు హీరోయిన్స్ కూడా శ్రీదేవి అందుకున్నంత రెమ్యున‌రేష‌న్ అందుకోవ‌డం లేదట‌. అందుకు కార‌ణం ఈ చిన్నారి క్రేజ్ అనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్నా చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి మంచి గుర్తింపు అందుకోగా, ఆమె త్వరలోనే మరొక మూడు సినిమాలలో కూడా నటించబోతోందట‌. అలాగే రెండు సీరియల్స్ కూడా ఆమె ఖాతాలో ఉన్నాయ‌ని తెలుస్తుంది.