Karthika Deepam : కార్తీకదీపం టీఆర్పీ రేటింగ్ కి తిరుగులేదంతే.! వచ్చేవారం సూపర్ ట్విస్ట్..!

Karthika Deepam : బుల్లితెర బాహుబలిగా కార్తీకదీపం గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ కు వచ్చినంత టిఆర్పి రేటింగ్ మరే సీరియల్ కు రాదు అనడంలో సందేహంలో లేదు. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ రేటింగ్స్ లో 12.60 టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకొని మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. కార్తీకదీపం 1500 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్నా కానీ కార్తీకదీపం టిఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది అంటే.. ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సీరియల్ లో ఈ వారం జరిగిన ఎపిసోడ్స్ హైలెట్స్ తో పాటు వచ్చేవారం కథను ఏవైపు మలుపు తిప్పుతారో చూద్దాం..!

karthika-deepam twist on next week
karthika-deepam twist on next week

దీపా కార్తీక్ వాళ్ళ సౌర్య ఇంద్రుడు దగ్గరే ఉంది అని అనుకుని తన మెచ్యూరి ఫంక్షన్ కు కావాల్సిన బట్టలు, నగలు అన్నీ కొనిస్తారు.. ఇంద్రుడు కార్తీక్ దీపలకు జ్వాలను ఇచ్చేద్దామని అనుకుంటాడు. కానీ చంద్రమ్మ మాత్రం జ్వాలను ఇవ్వడానికి ఒప్పుకోదు.. అందుకే తన ప్లేసులో వేరే అమ్మాయిని చూపిస్తుంది. అప్పటివరకు అక్కడ సౌర్య ఉంటుందని ఆశలు పెట్టుకున్న దీపకి మొండి చేయి ఎదురయింది.. దాంతో కన్నీళ్లు పెట్టుకొని ఇంటికి వచ్చేసింది దీప.

అవును వాల్తేరు వాణి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది అని దుర్గ ను దీప అడుగుతుంది. ఆ వాల్తేరు వాణి నిన్ను చంపాలని కుట్ర చేసింది దీపమ్మ.. ఇదంతా ఆ మోనిత చేయించింది అని దుర్గా చెబుతాడు.. అవునా నా వెనకమల ఆ మోనిత ఇంత కుట్ర చేసిందా? అయితే తన సంగతి ఇప్పుడే చూస్తాను అంటూ మోనిత వాళ్ళ ఇంటికి బయలుదేరింది.. దీప మోనిత రెండు చెంపలు వాయించి నా మీద కుట్ర చేయడానికి నీకు ఎంత ధైర్యం అని అంటుంది.. కార్తీక్ నా వాడు నాకు సొంతం అవ్వడం కోసం నేను ఏమైనా చేస్తాను అని మోనిత అంటుంది.. నువ్వు నా మీద ఎన్ని కొట్రలు చేసినా ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు నన్ను కాపాడతానే ఉన్నారు అది కార్తీక్ కి నాది ఉన్న భార్య భర్తల బంధం అని దీప అంటుంది.. ఈరోజు డాక్టర్ బాబు ఇంటికి రానివ్వు నీ సంగతి మొత్తం చెబుతాను.. ఈరోజుతో నువ్వు అయిపోయావు అని దీప మోనిత వార్నింగ్ ఇస్తుంది..

ఆనందరావు, హిమ ఇద్దరూ కలిసి ఇంద్రుడు వాళ్ళింటికి వస్తారు.. శౌర్య తమతో పాటు వాళ్ళింటికి రమ్మని చెబుతారు.. అయినా నేను ఇక్కడ ఉన్న విషయం మీకు ఎలా తెలిసింది.. పాప రానంటుంది కదా సార్ ఇక్కడే ఉండనివ్వండి అని ఇంద్రుడు అంటాడు.. ఆ మాటలకు కోపం వచ్చినా ఆనందరావు శౌర్య ఇక్కడే ఉండిపోవడానికి కారణం మీరే అనిపిస్తుంది అని ఇంద్రుడిని అంటాడు.. అయినా శౌర్య నా మనవరాలు నా మనవరాలు నాతో పాటు తీసుకువెళ్తానంటే మీకేంటి అభ్యంతరం అని ఆనందరావు ఇంద్రుడిని నిలదీస్తాడు సౌర్య వచ్చేవరకు మేం కూడా ఇక్కడే ఉంటాము.. ఇదిగో ఖర్చులకి డబ్బులు తీసుకోమని ఆనందరావు కోపంగా అంటాడు..

ఒక కారులో శౌర్య వెళ్లడం దీప చూస్తుంది.. ఆ కారులో నిజంగా వెళ్తుంది మన శౌర్య డాక్టర్ బాబు అని దీపం అంటుంది.. కార్తీక్ కారు వెనకమాల పరిగెత్తుతాడు.. శౌర్య చేతులు బయటకు పెడుతుంది..

అయితే అనుకుంటున్నట్టు శౌర్య వాళ్ళకి దొరకదు.. అలాగని ఆనందరావు తోపాటు వాళ్ళ ఇంటికి వెళ్ళదు.. అతు తిరిగి ఇటు తిరిగి శౌర్య ఆ ఇంద్రుడు, చంద్రమ్మ గూటికి చేరుతుంది ఇదే హైలెట్ సీన్. అలాగే మోనిత శౌర్య కోసం కార్తీక్ దీప ఆ ఆటో అతను ఇంద్రుడు కోసం వెతుకుతున్నారు అని తెలుసుకుంటుంది. ఇవే వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ లు.. మరి ఏం కానుందో తరువాయి భాగంలో చూద్దాం.