Health Tips : ఈ తీగ జాతి కూరగాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..! 

Health Tips : తీగ జాతి మొక్కలే కాదు తీగ జాతి కూరగాయలతో కూడా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ తీగ జాతి కూరగాయలు పర్వాల్ తీగ జాతి కూరగాయ కూడా ఒకటి. ఇది తేమతో కూడిన వాతావరణం లో ఎక్కువగా పండుతుంది.. అయితే మరీ తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ప్రాంతాలలో వేసవి పంటగా సాగు చేసి దూరప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. మరి ఈ కూరగాయ వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

Do you know the benefits of pointed gourd..!
Do you know the benefits of pointed gourd..!

ఈ పర్వాల్ కాయలలో నీటి శాతం అధికంగా ఉండటమే కాకుండా ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. తద్వారా శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే చర్మం పొడి మారిపోవడం , దద్దుర్లు, చర్మ సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. ఇక ఈ కాయలో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణాశయ సమస్యలు దూరం అవుతాయి. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఏ , విటమిన్ బి 1, విటమిన్ బి12, విటమిన్ సి వంటి విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఎవరైనా బరువు తగ్గాలనుకునే వారు ఈ కాయలను తమ ఆహారంలో ఒక భాగం చేసుకోవచ్చు. వీటితో వేపుడు లేదా పులుసు, కూర చేసుకుని తినడం వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. రక్తాన్ని శుభ్రం చేయడంలో ఈ కాయలు సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి. ఈ సీజన్లో వచ్చే ఫ్లూ వంటి వ్యాధులను దూరం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా శరీరం ఎటువంటి రోగాలనైనా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఇలా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు ఈ కాయల ద్వారా లభిస్తాయి.