Daily Astrology : మేషం:
ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని కొంత వరకు నిరాశ పరుస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు మిమ్మల్ని మరింత బాధిస్తాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు. చేపట్టిన పనులు సఫలం కావు. దైవస్మరణ మీకు కొంచెం ఊరట కలిగిస్తుంది.
వృషభం:
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఆకస్మిక ధన లాభం సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వస్తు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు.
మిధునం:
కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో విందు వినోదాధి కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ఇతరులకు ధన సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం:
కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగానే సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
సింహం:
రుణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కన్య:
ఉద్యోగ వాతావరణం మీకు అనుకూలిస్తుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం అవుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.
తుల:
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి , లాభాలు చూస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
వృశ్చికం:
ఇంటా బయట పరిస్థితులు చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది.
ధనస్సు:
ఆర్థిక సమస్యలు పెరిగి నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రులలో మాట పట్టింపులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమాదిక్యం తప్పదు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
మకరం:
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగం లభిస్తుంది . కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.
కుంభం:
దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త తప్పనిసరి.సోదరులతో చిన్న వివాదాలు ఏర్పడతాయి. ఇంటా బైటా ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
మీనం:
ఆప్తులతో శుభకార్యాలలో పాల్గొంటారు.. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి . విద్యార్థులు పోటీపరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.