Namrata : ఫ్యాన్స్ డాన్స్ లు చేసే న్యూస్ ఇది .. త్రివిక్రమ్ – మహేశ్ సినిమాలో నమ్రత స్పెషల్ గెస్ట్ రోల్ .. గెస్ కూడా చేయలేరు మీరు !

Namrata :  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట చిత్రం త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 28వ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కాస్టింగ్‌ విషయంలో కూడా అస్సలు తగ్గడం లేదట. మాములుగానే త్రివిక్రమ్‌ సినిమాలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉండేలా క‌థ‌న‌కు రాసుకుంటాడు. అందుకు త‌గ్గ‌ట్టే త‌న సినిమాల‌లో పాత్రకు న్యాయం చేయ‌గ‌లిగే యాక్టర్లను మాత్రమే ఎంపిక‌చేసుకుంటాడు.ఈ క్ర‌మంలో మహేష్ భార్య‌, మాజీ న‌టి న‌మ్ర‌త‌ని గెస్ట్ రోల్ కోసం ఎంపిక చేసినట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

namrata-plays-guest-role-in-mahesh-28-movie
namrata-plays-guest-role-in-mahesh-28-movie

Namrata : ఇది నిజమా…

నమ్రతా శిరోద్కర్.మహేష్ బాబు భార్య కాక ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అల‌రించిన విషయం తెలిసిందే. మిస్ ఇండియా గా నిలిచిన నమ్రతా శిరోద్కర్ తెలుగులో మహేష్ బాబు తో సినిమాలు చేస్తున్న స‌మ‌యంలో ఆయనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇతర స్టార్స్ ప్రేమ మాదిరిగా కొన్నాళ్లు సాగి వీరు విడిపోలేదు. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చి సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతున్నారు. మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన నమ్రతా శిరోద్కర్ ఆ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించింది.

హీరోయిన్ గా కాకుండా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా నమ్రతా శిరోద్కర్ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అప్ప‌ట్లో అభిమానులు త‌మ అభిప్రాయాల‌ని వ్య‌క్తం చేయ‌గా, అలాంటి ఆలోచ‌న త‌న‌కు లేదని న‌మ్ర‌త చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మ‌హేష్ 28వ సినిమాలో న‌మ్ర‌త ఓ గెస్ట్ రోల్ చేయ‌బోతున్న‌ట్టు వినికిడి. ఆమె ఏ పాత్ర చేస్తుందో తెలిస్తే మ‌హేష్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. చిన్న‌ప్ప‌టి మ‌హేష్ త‌ల్లిగా న‌మ్ర‌త న‌టించ‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. ఇది నిజమైతే ఫ్యాన్స్‌కి పూన‌కాలే అని చెప్పాలి.