Guppedanta Manasu : గుప్పెడంత మనసు సీరియల్ ఈ ట్విస్ట్ తో టిఆర్పి రేటింగ్ లో ఆ ప్లేస్ కి వెళ్తుందా.!?

Guppedanta Manasu : స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కుడా ఒకటి.. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎంటర్ టైనర్ చేసే కథ.. సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను టీవిల నుంచి కదలనివ్వకుండా కట్టిపడేస్తుంది ఈ సీరియల్.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో 11.15 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకొని రెండవ స్థానంలో నిలిచింది.. గుప్పెడంత మనసు గత కొన్ని వారాలుగా కార్తీకదీపంకు గట్టి పోటీని ఇస్తూ రెండవ స్థానంలోనే నిలుస్తూ వచ్చింది.. ఈ వారం కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది ఈ సీరియల్.. ఈ వారం ఈ సీరియల్ లో జరిగిన హైలైట్స్ తోపాటు వచ్చేవారం ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..!

guppedanta manasu serial trp rating
guppedanta manasu serial trp rating

వసుధర ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని రిషి అంటాడు.. నాకు కూడా అలాగే ఉంది అని వసుధర అంటుంది.. కానీ డాడ్ మనతో పాటు లేకపోవడమే నాకు ఇంకా బాధగా ఉంది.. మన మధ్య ఇప్పుడు ఎలాంటి షరతులు కూడా లేవు.. ఇప్పుడు డాడ్ వస్తె అన్ని సెట్ అవుతాయి అని రిషి అంటాడు.. ఏంటో వసుధర నాకు దగ్గర అయినా వాళ్లంతా దూరం అవుతున్నారు అని రిషి అంటాడు.. నేను మాత్రం ఎప్పటికీ నీతో పాటు ఉంటానని మీకు మాటిస్తున్నా సార్ అని వసుధర అంటుంది..

గౌతమ్ మహింద్రా వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. గౌతమ్ రిషి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు మహింద్రా.. మీకు తెలుసు కదా అంకుల్ వాడు ఎలా ఉంటాడో అని అంటాడు గౌతమ్.. ఇప్పటికైనా మీరు ఇంటికి వచ్చేస్తే మంచిది అంకుల్.. వాడు నన్ను చూసిన ప్రతిసారి నేను వాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను.. ఇప్పటికైనా మీరు ఇంటికి వచ్చేసేయండి అంకుల్ అని గౌతమ్ అంటాడు.. గౌతమ్ నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అని మహింద్రా అంటాడు.. చెప్పండి అంకుల్ ఏంటో చేస్తాను అని గౌతమ్ అంటాడు.. వసుధర తన మనసులో ఎలా ఆలోచిస్తుందో నువ్వు నాకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి అని మహింద్రా అంటాడు.. సరే అని గౌతమ్ అంటాడు..

మేడం మీరు ఇంతకుముందు ఒకసారి నాతో ఇలాగే మాట్లాడారు.. కానీ నేను అప్పుడు ఊరుకున్నాను..మీరు ఇలాగే ప్రతిసారి మాట్లాడితే నేను ఊరుకోను అని వసుధార అంటుంది.. హా.. ఏం చేస్తావు అని దేవయాని గట్టిగా అడుగుతుంది.. మేడం నేను ఈ విషయాలన్నీ రిషి సార్ తో చెప్పడానికి నాకు క్షణం పట్టదు అని వసుధార అంటుంది.. కానీ ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం నా స్వభావం కాదు.. అది నా వ్యక్తిత్వం , మనస్తత్వం కాదు మీకు అర్థమయ్యేలా చెబుతాను వినండి.. రిషి సార్ తో ఉండే హక్కు నాకుంది.. రిషి సార్ నా జీవితం.. తనతో పాటు కలిసి నేను జీవితాంతం ప్రయాణం చేస్తాను.. పద్ధతులు హద్దుల గురించి ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని వసుధారా దేవయాని తో అంటుంది.. మీకు నేను చాలా సార్లు చెప్పాను మీరు అనవసరంగా మా మీద లేనిపోయినవి ఊహించుకొని నిఘా పెట్టి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.. మీరు అన్న మాటలని నేను రిషి సార్ తో చెప్పడానికి నాకు క్షణం పట్టదు.. పైగా పెద్ద పని కూడా కాదు అని వసుధర అంటుంది..

వసుధార తలస్నానం చేసి తల ఆరబెట్టుకుంటూ ఉండగా.. రిషి హెయిర్ డ్రయర్ తో తనకు హెయిర్ డ్రై చేసే ప్రయత్నం చేస్తాడు.. అదేంటి సార్ ఇందాక నేను ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదు అని వసుధారా అంటుంది.. స్విచ్ కూడా ఆన్ చేయాలి వసుధారా అని రిషి అంటాడు.. సరే ఇవ్వండి సార్ నేను హెయిర్ డ్రై చేసుకుంటాను అని వసుధార అంటుంది.. ఏంటి సార్ మీరు నాకు ఇలా సేవ చేయటం.. అని వసుధార అంటుంది.. ఎప్పుడు నువ్వేనా నాకు సేవలు చేయడం నేను నీకు సేవలు చేయొద్దా అని రిషి అంటాడు.. అలా ఇద్దరు కలిసి ఒకే సోఫాలో ఒకరి మీద ఒకరు పడిపోతారు..

మహేంద్ర జగతి ఇంట్లో నుంచి దూరమై వసుధార, రిషిలను ఒక్కటి చేశారని చెప్పవచ్చు.. రోజురోజుకి రిషి వసుధారాల మధ్య బంధం బాగా బలపడుతుంది.. అయితే మహేంద్ర జగతి ఇద్దరు మిషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కలవాల్సి ఉంది .. అక్కడికి వాళ్ళిద్దరూ రాక తప్పదు. అక్కడ వాళ్ళు రిషికి కంట పడకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటారు.. కానీ రిషి ఎలాగోలా వాళ్ళిద్దర్నీ కలుస్తాడు. వసుధార గురుదక్షిణ ఒప్పందాన్ని వెనక్కి తీసుకుందని.. డాడ్ మీరు ఇంటికి వచ్చేస్తే వసుధారా ను నేను పెళ్లి చేసుకుంటానని రిషి మహేంద్రా తో చెబుతాడు.. ఇదే వచ్చేవారం హైలైట్ ట్విస్ట్ కానుంది..