Karthika Deepam 2 April Today Episode : హిమ తనకు తాను ఇంత పెద్ద శిక్ష వేసుకుందా.!? సౌర్యకు ఇద్దరు శత్రువులు..!

Karthika Deepam 2 April Today Episode : సౌర్య బస్తీలో వాళ్ళమ్మతో గడిపిన ఇంటికి వెళుతుంది.. ఆ ఇల్లు మోనితదే అని తెలుసుకుంటుంది. అంటే మోనిత ఆంటీ మా అమ్మను చాలా బాధ పెట్టిందా అని తెలుసుకుంటుంది.. ఆ ఇంట్లో ఉన్న పనిమనిషి వచ్చి.. ఈ ఇంటికి నీ ఈడు ఉన్న ఒక అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి వెళుతుంది..! ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి కాసేపు ఏడ్చి వెళ్ళిపోతుంది..!నా ఈడు అమ్మయా.. అంటే హిమనే నా.. అయితే ఇప్పటి నుంచి నాకు ఇద్దరు శత్రువులు. ఒకటి అమ్మానాన్న లను చంపేసిన హిమ అయితే..

ఆ ఆనంద్ కూడా ఇప్పటి నుంచి నా శత్రువు.. ఇక నుంచి తమ్ముడు అనే బంధం నాకు వద్దు.. ఇప్పటి వరకు నాకు అక్క, చెల్లి బంధం వద్దు అనుకున్నాను.. నేటి నుంచి అక్క, తమ్ముడు బంధం కూడా వద్దు అని సౌర్య నిర్ణయించుకుంటుంది..హిమ చీర కట్టుకొని పూలు పెట్టుకొగానే పెళ్లికళ వచ్చిందనీ వాళ్ల తాతయ్య అంటాడు. మీరు అలా మాట్లాడకండి హిమ కి కోపం వస్తుంది.

karthika deepam serial 02 April 2022 today episode highlights
karthika deepam serial 02 April 2022 today episode highlights

హిమ నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడగకూడదు అంటూ ఇండైరెక్ట్ గా అడుగుతుంది వాళ్ళ నానమ్మ.. సౌర్య దొరికేవరకు నేను పెళ్లి చేసుకోను.. ఒకవేళ దొరకదు అని మీరు అనుకుంటే.. జీవితాంతం నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాను.. ఇది నేను చేసిన తప్పుకు నాకు నేనుగా విధించుకున్న శిక్ష.. సౌర్య కచ్చితంగా దొరుకుతుంది. ఆ ఆశతోనే నేను బ్రతికుతున్నాను.. సౌర్య ను కచ్చితంగా వెతికి పట్టుకుంటాను అని హిమ చెబుతుంది.ల‌