Pregnant womens : గర్భం దాల్చిన స్త్రీలు పూజ చేయవచ్చా..?

Pregnant womens : మహిళకు మాతృత్వం అనేది ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు.. అమ్మాయి పుట్టడం ఒక అదృష్టం అయితే ఆ అమ్మాయి మహిళా గా మారి జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత మరొక ప్రాణానికి జీవం పోసినప్పుడు ఈ ప్రపంచమే కొత్తగా కనిపిస్తుంది. అందుకే గర్భందాల్చిన స్త్రీలను ప్రతి ఒకరు చాలా ప్రత్యేకంగా.. జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక మాతృత్వం పొందడానికి ఆ మహిళ కూడా ఎంతో ఆనందంగా.. ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇకపోతే గర్భం దాల్చినప్పుడు స్త్రీలు పూజ చేయవచ్చా అనే ప్రశ్న ఎదురయ్యింది.. స్త్రీలకు ఎక్కువగా భక్తి ఉంటుందని చెప్పవచ్చు. పూజలు, వ్రతాలు , నోములు ఇలాంటివి ఎన్నో చేయడంలో వారికి ఉన్న శ్రద్ధ మరెవరికీ లేదనే చెప్పాలి.

అంతే కాదు అభిషేకాలు, పూజలు అంటూ చుట్టుపక్కల దేవాలయాలన్ని తిరుగుతూ తమ భక్తిని దేవుడిపై చూపించుకుంటూ ఉంటారు. చిన్న కష్టం వచ్చిందంటే చాలు దేవుడి సన్నిధిలో కి వెళ్ళిపోయి తమ కష్టాలను చెప్పుకొని మనశ్శాంతి పొందుతూ ఉంటారు. గర్భవతులు పూజలు చేయవచ్చా అనే విషయానికి వస్తే.. నిజానికి గర్భవతిగా ఉన్న మహిళ మూడు నెలలు దాటితే ఆ ఇంటికి సంబంధించిన ఎటువంటి కొత్త నిర్మాణాలు మార్పులు చేయకుండా ఉండాలి అని పండితులు చెబుతున్నారు. ఇలా కొత్తగా ఏదైనా మొదలుపెట్టినప్పుడు గర్భంలో ఉండే శిశువుపై వాటి ప్రభావం పడుతుంది అని కొంతమంది పండితులు తెలియజేశారు.

women perform pujas and pregnant what does astrology
women perform pujas and pregnant what does astrology

శాస్త్రం ప్రకారం గర్భవతులైన స్త్రీలు తేలికపాటి పూజలు చేయవచ్చు. కానీ టెంకాయ వంటివి మాత్రం కొట్టకూడదు అని పండితులు చెబుతున్నారు . అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్లడం.. గుడి చుట్టూ ప్రదర్శనలు చేయడం.. కొత్త పూజ ప్రారంభించడం లాంటివి చేయకూడదట. కేవలం దేవుడు ముందు ధ్యానం మాత్రమే చేయాలి అని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు. గర్భందాల్చిన స్త్రీలు ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు అని సమాచారం. అంతేకాదు గర్భిణీ స్త్రీలు ఐదో నెల వచ్చే వరకు వ్రతం చేయవచ్చు అని ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ గది దగ్గరకు వెళ్ళకూడదు అని శాస్త్రం తెలియజేస్తోంది. దూర ప్రాంతాలలో ఉండే దేవాలయాలను కూడా సందర్శించకపోవడమే మంచిది.