Ugadi Pachhadi: చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటారు.. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైన ప్రసాదం..! తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం, పులుపు అనే షడ్రుచుల సమ్మేళనం ఈ పచ్చడి.. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి తెలియజేస్తోంది..! అటువంటి ఉగాది పచ్చడి ఉదయం పరగడుపున తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి తెలుసుకుందాం..!
ఉగాది పచ్చడిని ఖాళీ కడుపుతో ఉన్న తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. వేప పువ్వు వాత, పిత్త, కఫ దోషాలను పోగొడుతుంది. ఉగాది సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాంతో మసూచి, ఆటలమ్మ వైరస్ కారక వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఈ షడ్రుచుల సమ్మేళనం రోగనిరోధక శక్తిని పెంపొందించి హానికర బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
ఈ పచ్చడిని సేవించటం వలన ఈ సీజన్ కి కావలసిన ఇమ్మునిటి పవర్ ను పెంచుతుంది. ఈ పచ్చడిలో ఉండే ఆరు రకాల పదార్థాలు కలిపి తీసుకోవడం వలన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. మానసిక, శారీరక రుగ్మతల్ని తొలగించి పునరుత్తేజం ని అందిస్తుంది. ఉగాది పచ్చడి లో ఉపయోగించే వేపపువ్వు, బెల్లం, చింతపండు, మామిడి, ఉప్పు, కారం అన్ని సమపాళ్ళలో తీసుకుంటే సకల అరిష్టాలు తీరిపోయి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారని పెద్దలు చెబుతున్నారు.