Intinti Gruhalakshmi 02 April Today Episode : తులసి కాళ్లు పట్టుకున్న అనసూయమ్మ.. లాస్యతో ఇంట్లో నుంచి చెక్కేసిన నందు..!

Intinti Gruhalakshmi 02 April Today Episode : ఒక్కసారి నా గురించి కాదు మీ గురించి తనివితీరా మాట్లాడుకుందామా నందగోపాల్ గారు.. ఈ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నవు తులసి.. తేనె తొట్టె నీ కలిపింది తనే.. తేనెతీగలు కుడతాయి.. ప్రశ్న అడిగినప్పుడు సమాధానాలు వినే ఓపిక కూడా ఉండాలి.. మాట అన్నప్పుడు మాట పడడానికి కూడా సిద్ధంగా ఉండాలి.. భర్తగా.. కొడుకుగా.. తండ్రిగా మీ ఫెయిల్యూర్స్ కూడా చెప్పమంటారా నందగోపాల్ గారు..! అంటూ తులసి నందు చిట్టా విప్పుతుంది.‌!ఏ ఒక్క రోజు సినిమాకో, షికారుకో, ఊరుకో తీసుకెళ్లలేదు. మూరెడు మల్లె పూలు తీసుకు వచ్చిందే లేదు.. ఏ ఒక్క రోజు నన్ను వెన్నెలలో కూర్చోబెట్టి ముచ్చట్లు కూడా చెప్పలేదు.. ఏ ఒక్క రోజు కూడా నా వంటలు కానీ.. నా పనితనాన్ని కానీ.. నా అందాన్ని కానీ మెచ్చుకున్నదే లేదు.. భార్య అంటే ఆయన లాప్ టాప్.. ఆయన చెప్పినట్టు వినడం నడుచుకోవడమే..

Advertisement
Intinti Gruhalakshmi serial 02 April Today Episode
Intinti Gruhalakshmi serial 02 April Today Episode

భార్య అంటే ఆయన దృష్టిలో ఒక డోర్ మ్యాట్.. ఆయన అవసరాలకి నన్ను ఆ విధంగానే వాడుకున్నారు.. కేవలం మీ సోషల్ సర్కిల్ లో ఇమడలేనన్న ఒకే ఒక్క కారణంతో పాతికేళ్ళ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. నూరేళ్ళ నా జీవితాన్ని బుగ్గిపాలు చేశారు. మరొక ఒక ఆడదాని మెడలో తాళి కట్టారు. భర్తగా మీరు అతిపెద్ద ఫెయిల్యూర్.. ఇక తండ్రిగా మీ గొప్పతనం కూడా వింటారా.. పిల్లలు కష్టంలో ఉన్న ఏ విషయంలో కూడా వాళ్లకు అండగా నిలబడ లేదు. తండ్రిగా మీరు చాలా పెద్ద ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటారా.. మావయ్య ఆపరేషన్ కూడా లెక్కలు అడుగుతూ సంబంధం లేకుండా పారిపోతున్నారు ఇదేనా మీ కొడుకు బాధ్యత.. ఎవరైనా ఏదైనా అనుకుంటారనీ తల్లిదండ్రులను తీసుకెళ్లటం కాదు.. నీ మొండితనంతో నీ జీవితాన్ని నువ్వే పాడు చేస్తున్నావ్ దాన్ని నా మీద రుద్దకు..మీ మీ మీద ఇష్టం చచ్చిపోయినప్పుడు నాకు ఇష్టమైన మనిషిని నేను పెళ్లి చేసుకున్నాను అందులో తప్పేంటి..!?

Advertisement
Intinti Gruhalakshmi serial 02 April Today Episode
Intinti Gruhalakshmi serial 02 April Today Episode

నిన్ను నేను దూరం పెట్టినప్పటి నుంచి పిల్లల్ని నాకు దూరం చేసావ్ వాళ్ళ మనసులో నా పై విషాన్ని నింపావు.. తండ్రిగా నేను ఫెయిల్యూర్ అయ్యాను అంటే దానికి కారణం నువ్వే.. సంపాదిస్తున్నాను అనే అహంకారం నీ కళ్ళు నెత్తికెక్కేలా చేస్తుంది. ఒక్కటి గుర్తు పెట్టుకో ఇలాగే ప్రవర్తిస్తే జీవితంలో దెబ్బతింటావు. మగ తోడు లేని నీకు సమాజం ఇచ్చే గౌరవం ఏంటో నేను గడప దాటి వెళ్ళిన తరువాత నీకే తెలుస్తుంది. దురదృష్టం చాచి కొట్టినప్పుడు నీకు తెలుస్తుంది. నా వాళ్ళు ఎవరు రా అని చుట్టూ చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీ వైపు మాత్రం చూడను నందగోపాల్ గారు.. ఎందుకంటే మీ కారణంగానే జీవితం లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను.. ఎలా ఉండాలో కాదు ఎలా ఉండకూడదో కూడా తెలుసుకున్నాను.. మీరు చేసిన ఈ సహాయం చాలు నాకు..

Intinti Gruhalakshmi serial 02 April Today Episode
Intinti Gruhalakshmi serial 02 April Today Episode

నీ ఆత్మ విశ్వాసం, నీ ధైర్యం నిన్ను ఎక్కడ బోర్లా పడేలా చేస్తాయో నేను చూస్తాను కదా.. పదా లాస్య.. మనం అక్కర లేని వాళ్ళు మనకి అక్కరలేదు.. అంటూ నందు గడప దటతాడు లాస్యతో..తులసి వాళ్ళ అత్తయ్య మామయ్య లను వెదకడానికి చాలా దూరం పరిగెడుతుంది దాంతో తన కాలికి గాయాలు అవుతాయి వాటిని చూసిన వాళ్ళ అత్తయ్య తన కాళ్ళు పట్టుకుని ఆయిల్మెంట్ రాస్తుంది మీరు ఏంటయ్యా నా కాళ్లు పట్టుకుంటాను అని తులసి ఉంటుంది ఈ అమ్మ నీ కాళ్ళు పట్టుకొని ఆయింట్మెంట్ రాయకూడదా లేదంటే నీకు అమ్మను అయ్యే అదృష్టం నాకు లేదా అని అంటుంది వాళ్ళ అత్తయ్య.. దేవుడు ఒక అదృష్టాన్ని దూరం చేస్తే మరొక అదృష్టాన్ని దగ్గర చేస్తాడట.. మీ అబ్బాయికి దూరం చేసి నన్ను మీకు దగ్గర చేశాడు.. కాలికే కాదు నా మనసుకి అయినా ఆదాయానికి కూడా ఆయింట్మెంట్ రాశారు మీరు. ఈ రోజు నుంచి మీరు నా బాధ్యత కాదు అత్తయ్య.. మీరే నా బలం అని తులసి అంటుంది.

Advertisement