Beauty Tips : రావి ఆకులతో చర్మ సౌందర్యం మీ సొంతం..!!

Beauty Tips : భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం రావి చెట్టు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా రావి చెట్టు కింద ఒక గంట సేపు కూర్చుంటే చాలు ఆయురారోగ్యం ప్రసాదించబడుతుంది అని వైద్యులతో పండితులు చెబుతున్నారు. ఇక రావు చెట్టుకు పూజ చేస్తే ఏవైనా సమస్యలు ఉంటే ఇట్టే దూరమవుతాయని శాస్త్రం చెబుతోంది. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న రావి చెట్టు యొక్క ఆకులు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు అందాన్ని కూడా పెంపొందిస్తాయని సమాచారం.ముఖ్యంగా మహిళలు అందంగా కనిపించాలంటే రకరకాల సౌందర్య చిట్కాలు పాటిస్తూ ఉంటారు.

అందులో భాగంగానే ముఖం మీద వచ్చే నల్లటి మచ్చలను, మొటిమలను దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ విసుగు చెందుతుంటారు.. అందరికీ అందుబాటులో ఉండే ఈ ఆకుతో మరింత అందాన్ని పెంపొందించుకోవడంతో పాటు ముఖం మీద వచ్చే మొటిమలు.. మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా దూరమవుతాయి.. మీ చెల్లి , ప్రేయసి , భార్య, అక్క ఇలా ఎవరైనా సరే ఇలాంటి చర్మ సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లయితే వాట్సప్ ద్వారా ఈ ఆర్టికల్ వారికి షేర్ చేసి వారి అందానికి మీరు కూడా సహాయపడండి.

Beauty Tips with Raavi leaves is yours
Beauty Tips with Raavi leaves is yours

ఇక రావి ఆకుల వల్ల చర్మ సమస్యలు ఎలా దూరం అవుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. కొన్ని రావి ఆకులను తీసుకొని నీటిలో శుభ్రంగా కడిగి , మిక్సీలో వేసి , కొద్దిగా నీరు పోసి మెత్తటి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి ముఖానికి ఈవెన్ గా అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ముఖాన్ని బాగా ఎండబెట్టాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి కాటన్ టవల్ తో మాత్రమే ముఖాన్ని తుడుచుకోవాలి.. ఈ పద్ధతిని ప్రతి రోజూ పాటించడం వల్ల కేవలం మూడు రోజుల్లోనే మీ ముఖం మీద ఉండే మచ్చలు తగ్గుముఖం పడతాయి. రావి ఆకులతో చేసిన ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.