Karthika Deepam 30 Nov Episode : మోనిత తలకు గన్ ఎక్కు పెట్టిన సౌందర్య.!! శౌర్యను దీప కు ఇవ్వాలనుకున్న ఇంద్రుడు, చంద్రమ్మ..!

Karthika Deepam 30 Nov Episode :  కార్తికే వెతుక్కుంటూ వచ్చి దీపను తీసుకు వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. డాక్టర్ దీపకి రెండు రోజులు తర్వాత సర్జరీ చేద్దామని చెబుతుంది. డాక్టర్ ను నేనే అయినా సర్జరీ చేయాల్సింది మీరే కదా కార్తీక్.. మీ మనసు ఎందుకో స్థిమితంగా ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు అని డాక్టర్ అంటుంది. తను కనిపించకపోయేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే ఎమోషనల్ అయ్యాను అని కార్తీక్ అంటాడు. దీప ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తుంది. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవైనా ఉంటే త్వరగా సాల్వ్ చేసుకోమని డాక్టర్ సలహా ఇస్తుంది.

karthika-deepam-30-nov today full episode
karthika-deepam-30-nov today full episode

సౌందర్య అసలు నిజం తెలుసుకోవడానికి వేతుకుంటూ మోనిత ఇంటికి వెళుతుంది సౌందర్య. నువ్వు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నవు అది ఏంటో చెప్పమని మోనిత ను అడుగుతుంది. అంతలో సౌందర్యాన్ని ఆ రూంలో పెట్టి మోనిత లాక్ చేస్తుంది. తలుపు తీసుకుని సౌందర్య బయటకు వచ్చేసరికి మోనిత సౌందర్య తలకి గన్ గురిపెడుతుంది. ఎందుకు ఆంటీ మీరంతా పదేపదే ఇలా వచ్చి నన్ను విసిగిస్తున్నారు నా బ్రతుకు ఏదో నేను బ్రతుకుతున్నాను కదా అని మోనిత అంటుంది.

మోనిత సౌందర్య తలకి గన్ గురిపెట్టి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. మీరంతా మళ్ళీ నా లైఫ్ లోకి ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది. మొన్న కూడా మీరు నన్ను ఇలా విసిగిస్తున్నారని నీ తల పగలగొట్టాను. ఈసారి ఈ గన్నుతో ట్రిగ్గర్ నొక్కేస్తాను ఆంటీ అని మోనిత సౌందర్య ను బెదిరిస్తుంది. నా దగ్గరకు రాకండి అని అంటుంది. ఇక సౌందర్య మోనిత చేతిలో ఉన్న గన్ ను లాక్కొని తన తలకి గన్ ఎక్కు పెడుతుంది..

హేయ్ మోనిత నువ్వు మామూలు దానివి కాదు.. నీకు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు.. నువ్వు అసలు మారవు. అక్కడున్న బ్యాక్ పట్టుకో.. ఎక్కడికో వెళ్లాలని బట్టలు సర్దుకున్నట్టుగా ఆ బ్యాగు పట్టుకొని పదా.. నాకు కోపం వస్తే నేను ట్రిగ్గర్ నొక్కుతాను .. మర్యాదగా నడవమని మోనిత తో చెబుతుంది సౌందర్య. మోనిత ను బట్టల బ్యాగుతో తీసుకొని తన కారులోకి ఎక్కించుకుంటుంది.. ఎక్కడికి ఆంటీ అని మౌనిత అడుగుతుంది పేరంటానికి అని సౌందర్య వెటకారంగా సమాధానం చెబుతుంది..

హాస్పిటల్ బెడ్ పై ఉన్న దీప శౌర్యను వెతుకుతానని నాకు మాటిచ్చారు కదా వెళ్లి వెతకవచ్చు కదా అని కార్తీక్ ను అడుగుతుంది. నిన్ను ఒక్కదానినే వదిలేసి నేను ఎలా వెళ్తాను అని కార్తీక్ అంటాడు. మీకు నేను ఏమవుతానని మీరు ఎంతలాగా నా గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది దీప. ఎందుకు నాకోసం ఎంత చేస్తున్నారు. మీకు నేను ఏమి అవుతాను అని అడుగుతుంది దీప. అంత ఆస్తిపరురాలు బిడ్డ కోసం తిరిగి తిరిగి నడి రోడ్డు మీద అనాధ లాగా పడి ఉంది. నన్ను మనిషంటారా చంద్రుడు అని ఇంద్రుడు అడుగుతాడు. అయితే శౌర్య ఇచ్చేద్దాం గండ అని చంద్రమ్మ అంటుంది. ఈ చేద్దాం అని ఇంద్రుడు అంటాడు. మన జ్వాలమ్మని వాళ్లకే ఇచ్చేద్దాం అని అంటాడు ఇక హాస్పిటల్ లో దేనికోసమో లేచి బయటకు వచ్చిన దీప పడిపోతుండగా కార్తీక్ వెళ్లి పట్టుకుంటాడు.