Daily Astrology : రాశి ఫలాలు.. 30 నవంబర్ 2022 బుధవారం రాశి ఫలాలు..!

Daily Astrology : మేషం:
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు .పాత మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి.

Advertisement
Today horoscope.. 30 November 2022 Wednesday horoscope
Today horoscope.. 30 November 2022 Wednesday horoscope

వృషభం:
వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది . స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

Advertisement

మిధునం:
చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట ఒత్తిడిలు పెరుగుతాయి . వ్యాపారాలు , ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

కర్కాటకం:
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది . సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి.

సింహం:
వ్యాపార , ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు . ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

కన్య:
సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుసుకొని వివాహ విషయమై చర్చ చేస్తారు. నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడ గలుగుతారు.

తుల:
దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

వృశ్చికం:
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేస్తారు.

ధనస్సు:
ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

మకరం:
కుటుంబ సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి.

కుంభం:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

మీనం:
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు ముందుకు సాగగా నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

Advertisement