Guppedanta Manasu 30 Nov Episode : మహేంద్ర ఫోన్ కి జగతి పంపించిన మెసేజ్ చూసి డిలీట్ చేసిన రిషి.! ధరణి మాటలకు భయపడిన దేవయాని..

Guppedanta Manasu 30 Nov Episode : జగతి డిస్చార్జ్ అవడంతో కార్ లో రిషి పక్కన వసుధర వెనకమాల సీట్ లో మహేంద్ర జగతి ఇద్దరు కూర్చుని ఇంటికి బయలుదేరుతారు. మహేంద్ర నువ్వు నేను పక్కపక్కన రిషి వసుధార పక్కపక్కన కూర్చుని కారులో మన ఇంటికి వెళ్తున్న ఈ సీన్ చాలా బాగుంది అని జగతి మనసులో అనుకుంటుంది. అప్పుడే మహేంద్ర కి జగతి ఒక మెసేజ్ చేస్తుంది. అంతలో ఆ మహేంద్ర ఫోన్ రిషి దగ్గర ఉండడం చూసి జగతి కంగారుపడుతుంది.. రిషి మహేంద్ర ఫోన్ ఓపెన్ చేసి జగతి పంపిన మెసేజ్ చదువుతాడు.. ఇక వెంటనే ఆ మెసేజ్ ను డిలీట్ చేస్తాడు..

Guppedanta Manasu 30 Nov today full Episode
Guppedanta Manasu 30 Nov today full Episode

రిషి తన కార్ లో జగతి మహేంద్ర లను తీసుకొని ఇంటికి వస్తాడు. రిషి కారులో నుంచి దిగిన జగతి కళ్ళు తిరిగి కిందపడిపోతుండగా.. రిషి జాగ్రత్తగా పట్టుకొని తీసుకొస్తాడు.. ఆ సీన్ చూసిన దేవయాని కుళ్ళుకొని చస్తుంది.. నీ టైం బాగుంది జగతి అందుకే నువ్వు మళ్ళీ ఇంట్లోకి వస్తున్న ఎన్నిసార్లు గేంటేసిన నువ్వు ఇంట్లోకి వస్తున్న నిన్ను మళ్ళీ బయటికి ఎలా పంపించాలో నాకు తెలుసు అని దేవయాని మనసులో అనుకుంటుంది. రిషి జగతి మహేంద్ర ఇంట్లోకి వస్తుండగా హారతి పళ్ళను తీసుకొని వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని దేవయని అంటుండగా చేయనివ్వండి పెద్దమ్మ అని రిషి అడ్డుపడతాడు. ఇక ధరణి దిష్టి తీసేటప్పుడు ఇంట్లో వాళ్ళ దిష్టి కూడా అని అనడంతో అది దేవయానిని ఉద్దేశించి అంది అని మహేంద్ర ధరణి ఇద్దరు మనసులో నవ్వుకుంటారు..
మేడం మీరు కింద నా రూమ్ లో ఉండండి పైన డాట్ నేను ఇద్దరం అడ్జస్ట్ అవుతాం అని చెబుతాడు. వసుధారా మేడం ని జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు..

దేవయాని కోపంగా వంటగదిలోకి వెళ్లి ఏం చేస్తున్నావ్ ధరణి అని అడుగుతుంది. వంట చేస్తున్నాను అది ఇది అని చెప్పబాకు.. నిన్ను ఆ హారతి పళ్లెం పట్టుకొని ఎవరు రమ్మన్నారు. వాళ్ళు ఏమైనా కొత్త దంపతులు అనుకుంటున్నావా హారతి తీయడానికి అని అడుగుతుంది .. అయినా ఆ ఇంట్లో వాళ్ళ దిష్టి అని అంటావేంటి.. వాళ్ళకి ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళ దిష్టిపెట్టారు అని గుచ్చి గుచ్చి అడుగుతుంది దేవయాని. పెద్ద మావయ్య గారి వాళ్లకి హారతి తీయమని చెప్పారు అత్తయ్య గారు .. కావాలంటే మావయ్య అని అడగండి అని అంటుంది. అటుగా వెళుతున్న ఫణీంద్ర ను చూసి మావయ్య గారు మావయ్య గారు అని ధరణి పిలుస్తుంది. ఇప్పుడు నిజా నిజాలు తెలుసుకోవాల్సిన సమయం అని దేవయాని చిన్నగా ధరణితో చెబుతుంది. ఏం లేదండి మీకు కాఫీ కావాలా అని ధరణి పిలిచింది అని దేవయాని కవర్ చేస్తుంది. నీ పని ఎప్పుడు కాదు ధరణి సమయం చూసుకొని చెబుతాను అని దేవయాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

జగతి దగ్గరకు వచ్చిన రిషి తనతో మాట్లాడాలని వసుధారని మేడంకి జ్యూస్ తీసుకు రమ్మని చెప్పి పంపిస్తాడు. మేడం డాడ్ మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. జరిగిన యాక్సిడెంట్స్ లో గాయాలతో ఇద్దరూ బయటపడ్డారు. డాడ్ కి ఏమైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి.. మీకు కి ఏమైనా జరగరానిది జరిగితే డాడ్ పరిస్థితి ఏమవుతుంది. డాడ్ ప్రశాంతంగా ఉండలేరు. డాడ్ గురించి ఆలోచించారా.. ఆయనకు ఏమైనా అయితే మీరు, నేను ఏమవుతం.. ఇప్పుడు నేను ఏం చేసాను రిషి అని జగతి అడుగుతుంది. మీరు డాడ్ కి ఏదో మెసేజ్ పెట్టారు. నేను దానిని డిలీట్ చేశాను. ఇక చచ్చిపోయిన పర్లేదు అని మీరు రాశారు. అందుకే డిలీట్ చేశారు. అది మీ కన్నా నాకే బాగా తెలుసు.. డాడ్ ఆనందం కోసమే మిమ్మల్ని ఈ ఇంటికి రిక్వెస్ట్ చేశాను.. మీరు బాధపడితే డాడ్ తట్టుకోలేరు మీకు ఇప్పటివరకు ఆ విషయం అర్థం కాలేదేమో కానీ నాకు ఆ విషయం అర్థమైంది అని రిషి జగతితో చెబుతాడు.