Karthika Deepam 26 Oct Episode : పెద్దమనిషి అయిన శౌర్యను చూడటానికి ఇంద్రుడితో వెళ్తున్న దీప, కార్తీక్..

Karthika Deepam 26 Oct Episode : దీప ఇచ్చిన టిఫిన్ దుర్గ తింటుండగా.. వాణి కోపంగా వచ్చి దుర్గా చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ ను లాక్కుంటుంది.. నువ్వు టిఫిన్ చేయట్లేదు కదా అని ఇంకా నేను కూడా చేయొద్దా అని దుర్గా అడుగుతాడు.. అబ్బే అదేం లేదు కార్తీక్ అన్నయ్య కూడా వచ్చాడు కదా.. ఇద్దరు కలిసి తింటారు అని అంటుంది.. ఇద్దరు ఒకేసారి టిఫిన్ తింటే బాగుంటుంది అని.. కరెక్ట్.. రండి కార్తీక్ సార్ అని దుర్గ అంటాడు.. వాల్తేరు వాణి సీరియస్ గా వాళ్లిద్దరి వైపు చూస్తుంది.. కార్తీక్ సార్ ఈ టిఫిన్ తినకుండా ఎట్లా ఆపాలా అని వాల్తేరు వాణి ఆలోచిస్తూ ఉంటుంది.. సరిగ్గా అప్పుడే మోనిత వచ్చి కార్తీక్ చేతిలో ఉన్న ప్లేటును విసిరు కొడుతుంది.. ఇక వాణి మోనిత పై రెచ్చిపోతూ కుర్చీలు ఎత్తి ఇద్దరూ కొట్టుకునే దాకా   వస్తారు.. ఇక అక్కడ ఉన్న టిఫిన్ మొత్తం పాడవుతుంది.. మోనిత వాణి ఇద్దరినీ కార్తీక్ కంట్రోల్ చేసి మోనిత తో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు.. హమ్మయ్య ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అని వాణి మనసులో అనుకుంటుంది..

karthika-deepam-26-oct-today full episode
karthika-deepam-26-oct-today full episode

క్షణాల్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదో సరిగ్గా వాణి మెసేజ్ చేసింది కాబట్టి సరిపోయింది.. లేకపోతే నా హమ్మో అంటూ మోనిత ఆ ఊహలో భరించలేకపోయింది.. అంతలో కార్తీక్ వచ్చి మోనితను ప్రియమణి అంటే ఎవరు అని అడుగుతాడు.. ఏమో కార్తీక్ నాకు తెలియదు అని మోనిత చెబుతుంది.. అదేంటి ప్రియమణి నువ్వు తనకి తెలుసు అని చెప్పింది.. తను నీ దగ్గర పని చేసిందని కూడా చెప్పింది.. పైగా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అంటే మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మేడం నాకెందుకు చెప్పకుండా ఉంటారు అని అంటుంది అని కార్తీక్ వరుస ప్రశ్నలు వేస్తాడు.. పని వాళ్ళను కూడా పెళ్లికి పిలుస్తామా అని మోనిత అంటుంది.. ఇంతకీ మన పెళ్లి ఎప్పుడు అయ్యింది మోనిత ఆనంద్ ను చూస్తే ఒక సంవత్సరం బాబు లాగా కనిపిస్తున్నాడు.. బహుశా మనిద్దరికీ పెళ్లి జరిగి ఉండుంటే ఈపాటికి మనకి ఓ 10 నుండి 12 ఏళ్ల పిల్లలు ఉండాలి.. మనకి అంత పెద్ద పిల్లలు లేరు .. అంటే మన పెళ్లి జరిగిందా.. లేదంటే ఏంటి అని అంటాడు కార్తీక్.. అందరికీ 21 సంవత్సరాలకి పెళ్లి కావాలని రూల్ లేదు కదా కార్తీక్.. మనం కాస్త లేటుగా పెళ్లి చేసుకున్నాం అని మోనిత అంటుంది.. నీ నుంచి నిజం రాబెట్టాలని నేను ఎంత ప్రయత్నించినా నువ్వు బాగానే ప్రిపేర్ అయి వచ్చినట్టున్నావే అని కార్తీక్ మనసులో అనుకుంటాడు..

ప్రియమణి కి దీప కూడా తెలుసా అని కార్తీక్ అడుగుతాడు.. అసలు తను ఎవరో నాకు తెలియదంటే.. తనకి ఎవరెవరు తెలుసు నాకు ఎలా తెలుస్తుంది అని మోనిత అంటుంది.. లేదు మోనిత నువ్వు ఏదో నాకు అబద్ధం చెబుతున్నావు అని కార్తీక్ అంటాడు.. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని మోనిత అంటుంది.. నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావు అని నాకు తెలిస్తే.. నాలో రాక్షసుడిని చూస్తావు.. జాగ్రత్త అని కార్తీక్ మోనితకు వార్నింగ్ ఇస్తాడు.. ఇది శాంపుల్ మాత్రమే నీ అంతట నువ్వు నిజం ఒప్పుకునేదాకా.. ఏం చేస్తానో చూడు అని కార్తీక్ మనసులో అనుకుంటాడు..

జ్వాలా పుష్పవతి అయింది అని చంద్రమ్మ చెబుతుంది.. ఇక ఒక లిస్టు రాసి ఇస్తే ఆ సరుకులు అన్ని తీసుకొచ్చి ఇంద్రుడు ఇస్తాడు.. జ్వాలమ్మ పెద్దింటి బిడ్డ తనకి ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలి అని చంద్రమ్మ అంటుంది.. అంత డబ్బులు లేవు కదా అని ఇంద్రుడు అంటాడు.. నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొస్తాలే నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని ఇంద్రుడు బయటకు వస్తాడు.. రేపటి ఎపిసోడ్ లో జ్వాలా ఫంక్షన్ చేయడానికి డబ్బులు ఎలా సంపాదించాలని ఇంద్రుడు ఆలోచిస్తూ ఉంటాడు.. మరోపక్క కార్తీక్ శౌర్య గురించి కనుక్కుంటూ ఉంటాడు.. మనం ఎప్పటినుంచో వెతుకుతుంది ఈ ఆటోనే డాక్టర్ బాబు అంటూ ఇంద్రుడిని చూపిస్తూ దీప చెబుతుంది.. నా ఆటో వెనుక ఆ బోర్డ్ రాసింది మా జ్వాలమ్మ అని ఇంద్రుడు అంటాడు.. పద వంటలక్క వెళ్దాం అని కార్తీక్ అంటాడు డాక్టర్ బాబు వంటలక్క అంటే వీళ్లిద్దరే మా జ్వాలమ్మ అమ్మానాన్నలు అని ఇంద్రుడు అనుకుంటారు త్వరగా పదా అని దీప ఇంద్రుడు తో అంటుంది.. ఎక్కడికి అని అడిగితే ఇంకెక్కడికి మీ పాపని చూడటానికి పెద్దమనిషి అయింది అని చెప్పావు కదా అని కార్తీక్ అంటాడు..