Guppedanta Manasu 26 Oct Episode : మహీంద్రా రిషికి ఇవ్వమన్నది గౌతమ్ ఇచ్చాడా.!? దేవయానికి ఎదురు చెప్పిన రిషి..!

Guppedanta Manasu 26 Oct Episode :  గౌతమ్ ను చూస్తూ రిషి డాడ్ నామీద అలిగారు అంతే.. డాడ్ ది చిన్నపిల్లల మనస్తత్వం.. డాడ్ కనిపించగానే ఒక హగ్ ఇచ్చి సారీ చెప్పేస్తే  ఆయన కూల్ అయిపోతారు అని గౌతమ్ రిషి తో అంటాడు.. నాకు తెలుసు అని రిషి అంటాడు .. ఆ మాటలు చాటుగా గదిలో ఉండి వింటున్న మహీంద్రా ఎమోషనల్ అవుతాడు.. చూసావా జగతి నా మీద రిషి కి ఎంత ప్రేమో.. నేనే కసాయి వాడిని అని మహీంద్రా అంటాడు.. సరే రా మీరు వెళ్ళండి నేను కాసేపైన తర్వాత వస్తాను అని గౌతమ్ అంటాడు..

Guppedanta Manasu 26 Oct today full Episode
Guppedanta Manasu 26 Oct today full Episode

రిషి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత మహీంద్రా వాళ్లు బయటకు వస్తారు నేనే మిమ్మల్ని ఇక్కడ దాచి పెట్టాను అన్న సంగతి రిషికి తెలిస్తే.. రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి చాలా బాధగా ఉంది అంకుల్ అని గౌతమ్ అంటాడు.. మహీంద్రా గౌతమ్ ను గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తాడు.. అంకుల్ మీరు కూడా ఏంటి అని గౌతమ్ అంటాడు.. నువ్వు కూడా ఇది రిషికి అందజేయి అని మహీంద్రా చెబుతాడు.. అంకుల్ మీకు ఇక్కడ ఉండడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశాను.. వంట చేయడానికి కూడా ఒక పని మనిషిని రమ్మని చెప్పాను.. అని గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

రిషి ఇప్పుడే మీ పెద్దనాన్నకు ఫోన్ చేశాను మహింద్రా కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వద్దు అని చెప్పాడు.. ఇది కూడా కరెక్టే అంకుల్ మనసు కూల్ అయ్యాక ఇంటికి వస్తారు అని గౌతమ్ అంటాడు.. ఇప్పుడు ఏమైందని మహీంద్రా ఇంటికి రాకపోవడానికి.. ఆ జగతి వచ్చిన దగర నుంచి మహీంద్రా మారిపోయాడు అని దేవయాని అంటుంది. ప్లీజ్ పెద్దమ్మ డాడీని ఏం అనొద్దు నాకు తండ్రి అవ్వడం కంటే ముందే ఆయన మేడం కి భర్త అని రిషి అంటాడు.. డాడ్ ఒక భర్తగా తన బాధ్యతను నిర్వర్తించారు.. వాళ్ళిద్దరూ గురించి ఇలా మనం మాట్లాడుకోవడం కరెక్ట్ అని అనిపించుకోదు అని రిషి అంటాడు.. ఆ మాటలు విని మిగతా వాళ్ళందరూ సంతోషిస్తారు.. కానీ దేవయాని మాత్రం మనసులో రిషి ఇలా మారిపోతున్నాడు ఏంటి అని ఆలోచిస్తుంది..

లోపం నా దగ్గరే ఉండి ఉండాలి అని రిషి అంటాడు.. ఒక మనిషి మనసు సొంతం అని అనుకున్నాక తోడు ఉండాలి కదా అని రిషి అంటాడు.. డాడ్ నన్ను వదిలి వెళ్లారు అంటే అది నా తప్పే కదా అని రిషి అంటాడు.. మహీంద్రా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళినా కూడా రిషిలో ప్రేమ తగ్గడం లేదు ఎందుకో అని దేవయాని ఆలోచిస్తుంది.. వసుధర ఇంకా నువ్వెందుకు ఇంటికి వెళ్ళు అని దేవయాని అంటుంది. అదేంటి పెద్దమ్మ వసుధారా ని ఇక్కడే ఉండనివ్వండి అని గౌతమ్ అంటాడు. ఏరా రిషి నువ్వేమంటావు అని గౌతమ్ అడగగా వసుధర ఇక్కడే ఉంటుంది అని చెప్పి రిషి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు..

వసుధర మనం ఇలా దగ్గర అవ్వాలనే డాడ్ దూరమయ్యారు.. డాడ్ ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉంటారు.. రిషి వాళ్ళ డాడ్ గురించి ఆలోచిస్తూ ఉండగా.. మినిస్టర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది అదే విషయాన్ని వసుధారతో చెబుతాడు. మనకి బాధగా ఉందని మిగతా వారికి పనులు ఆపలేము కదా రిషి సార్.. కాల్ లిఫ్ట్ చేయమని వసుధర చెబుతుంది.. మహీంద్రా, జగతి వాళ్ళు మిషన్ ఎడ్యుకేషన్ అఫీషియల్ మీటింగ్ కి రావటం లేదని కన్ఫామ్ చేస్తూ మెయిల్ చేశారని చెబుతారు.. ఆ విషయం విని రిషి షాక్ అవుతాడు..