Intinti Gruhalakshmi 26 Oct Episode : తులసి సామ్రాట్ తో తప్పు చేసిందన్న అనసూయమ్మ, నందు..! సూపర్ ట్విస్ట్ ఇచ్చిన తులసి..!

Intinti Gruhalakshmi 26 Oct Episode : సామ్రాట్ తులసి ఎదురుగా ఉన్న ఒక ఇంట్లోకి వెళ్తారు.. ఇక కాలింగ్ బెల్ కొట్టగానే ఆ ఇంట్లో నుంచి ఇద్దరు కుర్రాళ్ళు బయటికి వస్తారు.. మేము ఈ తుఫానులో ఇరుక్కుపోయాము.. మా ఇంటికి అర్జెంటుగా కాల్ చేసుకోవాలి.. నేను బాగా తడిచిపోయారు అర్జెంటుగా తనకి ఓ టవల్  ఇవ్వండి అని సామ్రాట్ అంటారు. మేము మీ ఇంట్లో వాళ్లకి కాల్ చేసి చెబుతాం అంతేగాని లోపలికి రానివ్వమని వాళ్ళు అంటారు. అయితే నా పేరు సామ్రాట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి   అంటాడు. ఇక గూగుల్లో సెర్చ్ చేయగానే మీరు బిజినెస్ మ్యాన్ చాక్లెట్ ద్వారా ఇంత పెద్ద వాళ్ళు మా ఇంటికి వచ్చారా?   ఆశ్చర్యపోతూ లోపలికి పిలుస్తారు ఇక తులసి వెంటనే ప్రేమ్ కి కాల్ చేస్తుంది..

intinti-gruhalakshmi-26-oct-today full episode
intinti-gruhalakshmi-26-oct-today full episode

ప్రేమ్ కాల్ లిఫ్ట్ చేయగానే ప్రేమ్ నేను అమ్మని అని తులసి మాట్లాడుతుంది.. మేమిద్దరం ఇక్కడ వానలో ఇరుక్కుపోయాము.. దగ్గర లో ఓ ఇల్లు ఉంటే ఆ ఇంట్లోకి వచ్చి కాల్ చేస్తున్నాము అని తులసి చెబుతుంది.. ఏం పర్లేదు అమ్మ మీరు అక్కడే  జాగ్రత్తగా ఉండండి అని ప్రేమ్ చెబుతాడు.. వాన తగ్గే వరకు బయటకు రాకుండా ఉంటేనే మంచిది ఆంటీ అని అంకిత సలహా ఇస్తుంది.. పరంధామయ్య కూడా జాగ్రత్తగా ఉండమని చెబుతాడు.. అంతలోనే కాల్ కట్ అవుతుంది. ఇక పార్టీ చేసుకుంటున్నా ఆ ఇంట్లో వాళ్ళందరూ సామ్రాట్ తులసిని కూడా పార్టిస్పేట్ చేయమని అడుగుతారు..   అంతకు ముందు దాండియా ఆడిన వీడియో చూపించి మీరు కూడా మాతో పాటు ఈ పార్టీలో పార్టిస్పేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని అడుగుతారు.. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి.. వాటిని మార్చుకొని మాతోపాటు ఈ పార్టీలో పాటిస్పేట్ చేయమని అడుగుతారు.. సరే అని తులసి సామ్రాట్ అంటారు..

అమ్మా నువ్వు వెళ్ళి నిద్రపో అని నందు అంటాడు.. ఇప్పుడు మన ఇంటి పరువు రోడ్డు మీద పడి తిరుగుతోంది అని అనసూయమ్మ అంటుంది. నేనంటే గౌరవం లేదు.. సరే పోనీ మీరు పెద్దవాళ్ళు కనీసం మీ మీదైనా గౌరవం ఉండాలి కదా అని నందు అంటాడు.. వాళ్ళిద్దరూ కలిసి ఒకే గదిలో ఉన్నారన్న ఊహ నేను భరించ లేకపోతున్నాను అని అనసూయమ్మ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా.. కానీ బయటకు చెప్పలేకపోతున్నాను అని  మనసులో అనుకుంటాడు..

తులసి చీర మార్చుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది.. తులసిని డ్రెస్సు లో చూడగానే సామ్రాట్ ఊహల్లో తేలిపోతాడు.. అంతలో అక్కడ ఉన్న కుర్రాలలో ఒక అతను తను ఇష్టపడుతున్న అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు.. ఇప్పటివరకు మనం స్నేహితులుగా ఉన్నాం.. ఆ స్నేహమే ప్రేమగా మారింది.. స్నేహితులు ప్రేమికులుగా మారకూడదా అని అతను అన్న మాటలు సామ్రాట్ ను ఇన్‌స్పైర్ చేస్తాయి.. అయితే తులసి పైన కూడా సామ్రాట్ కు కూడా అదే ఉద్దేశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక తరువాయి భాగంలో తులసి ఇంటికి వస్తుంది.. తనని డ్రెస్ లో చూసిన అనసూయమ్మ ఇంట్లోకి రావడంతోనే తులసి వాలకం చూస్తుంటే  కచ్చితంగా ఏదో తప్పు చేసి వచ్చినట్లు అనిపిస్తుంది అని అంటుంది.. నందు ప్రేమాయణం అంటూ గొడవ చేస్తాడు.. వీళ్ళిద్దరికీ గట్టిగా బదులు చెప్పడానికి తులసి మేమిద్దరం స్నేహితులమే అంటూ మరోసారి సూపర్ ట్విస్ట్ ఇవ్వనుంది.. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం..