Karthika Deepam 08 Nov Episode : ఇంద్రుడిని అనుమానించిన శౌర్య.! మోనితపై ఫైర్ అయిన కార్తీక్..

Karthika Deepam 08 Nov Episode :  కార్తీక్ కోసం మోనిత ఎదురుచూస్తూ ఉంటుంది.. కార్తీక్ ఇంటికి రాగానే మోనిత ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది.. మోనిత ఇంట్లో దుర్గ గారు లేరా అని అడుగుతాడు. అందుకే నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావా అని కార్తీక్ అంటాడు. మనం ఒక్కసారి ఆ మనిషి మనల్ని ప్రేమించడం లేదు అని తెలిశాక అది నిజం అని చెప్పడానికి.. ట్రై చేసినా అది అబద్ధం గానే ఉంటుంది అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏ అమ్మాయి ప్రేమించినంతగా చేయకూడని పనులన్నీ నేను నీకోసం చేశాను. అయినా నీకు నా ప్రేమ అర్థం కావడం లేదు కార్తీక్. నా ప్రేమ ప్రూవ్ చేసుకోవడానికి ఆ వంటలక్క అడ్డు వస్తే నేరుగా నేనే తన అడ్డుని తొలగిస్తాను అని మోనిత మనసులో అనుకుంటుంది.

karthika deepam 08 nov today full episode
karthika deepam 08 nov today full episode

కార్తీక్ దీప ఇద్దరూ కలిసి ఇంద్రుడు వాళ్ళింటికి వెళ్తారు. అప్పటికే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతారు. మీరు ఇల్లు అద్దె కోసం వచ్చారా.. ఒక్కసారి ఇంట్లోకి వెళ్లి అంతా చూసుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని అంటాడు ఇంటి ఓనర్.. దీప , కార్తీక్ ఇద్దరు ఇక ఆ ఇంట్లో దీప వెతుకుతూ ఉంటుంది. చివరగా ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూసి డాక్టర్ బాబు అని దీప పెద్దగా అరుస్తుంది. అందులో శౌర్య ఇంద్రుడు చంద్రమ్మ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఉంటుంది. కచ్చితంగా మన శౌర్య వీళ్ళ దగ్గరే ఉంది డాక్టర్ బాబు అంటూ దీప ఏడుస్తుంది. వీళ్లకు నేను ఏం అన్యాయం చేశానని నన్ను మోసం చేశారు.. నాకు నా అత్తమ్మ నా శౌర్య ను దూరం చేశారు అని ఏడుస్తుంది. వాళ్ళు కావాలనే శౌర్య ను దూరం చేశారు. శౌర్య ను ఇక్కడి నుంచి తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయరు.. ఎక్కడ ఉంటారో కూడా ఇప్పుడు నాకు అర్ధం కావట్లేదు.. ఇక శౌర్య నా దగ్గరకు వస్తుందా. ఇక వాళ్ళు శౌర్య ను నా కంత పడకుండా జాగ్రత్తగా ఉంటారు అని దీప అంటుంది..

ఇంద్రుడు శౌర్య వాళ్ళను తీసుకొని వేరే ఊరికి వెళ్తాడు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బాబాయ్ అని సౌర్య అడుగుతుంది. మొన్న మీ అమ్మ కనిపించింది కదా ఆ ఊరే వెళ్తున్నాం. కాకపోతే మనం ఆ పక్క ఊర్లో ఉంటాం అంటుంది వాళ్ళ పిన్ని.. అదేంటి అమ్మ సంగారెడ్డిలో కనిపిస్తే ఆ పక్క ఊర్లో ఉండటం ఏంటి అని సౌర్య అనుమానంగా అడుగుతుంది.. ఆ ఊరిలో ఇల్లు అద్దె రెట్లు ఎక్కువ సౌర్య . అందుకోసం అనే మనం పక్క ఊరిలో ఉంటున్నాము. రోజు మనం ఈ ఆటోలో సంగారెడ్డి వెళ్లి అమ్మానాన్నలు వెతుకుదాం అని ఇంద్రుడు అంటాడు.

ఇంద్రుడు శౌర్య ను తీసుకుని దారిలో కనిపించిన గుడికి వెళ్తాడు గుడిలో పంతులుగారు మీ అమ్మానాన్నల పేర్లు చెప్పండి అని అనగానే ఇంద్రుడు వాళ్ల పేర్లు చెబుతాడు ఇక సౌర్య సైలెంట్ గా ఉండిపోతుంది గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత శౌర్య ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఇంద్రుడు శౌర్య వైపు చూస్తాడు బాబాయ్ అని సౌర్య పిలవగానే గుడిలో మేము మీ అమ్మానాన్న పేర్లు చెప్పకుండా మా పేర్లు ఎందుకు చెప్పమని అనుకుంటున్నావు కదా శౌర్య అని అంటాడు అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో కార్తీక్ దీప వాళ్ళ ఇంట్లో ఉన్న మోనితను అనుమానిస్తాడు. దుర్గతో నువ్వు ఎలా ఉంటున్నావో నాకు తెలియదు అని అనుకుంటున్నావా.. అంటూ మోనితను తక్కువ చేసి మాట్లాడతాడు. కార్తిక్ నిజంగా గతం గుర్తుకు వచ్చిందా అని మోనిత అనుకుంటుంది. నాకు మోనితతో మాట్లాడేంత ఓపిక లేదు డాక్టర్ బాబు దయచేసి తను ఇక నుంచి తీసుకు వెళ్లిపోండి అని దీప అంటుంది. ఈరోజు నేను వెళ్లిపోవడం కాదు మీ ఇద్దరి సంగతి ఏంటో తెలుస్తాను అని మోనిత అంటుంది.