Singer Sunitha : డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి మొహం మీదే అలా చెప్పేసిన సునీత.. బిత్తర పోయిన ఫ్యాన్స్..!!

Singer Sunitha : ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చే ఏ సినిమాలో అయినా సరే నటిస్తే చాలు మన జీవితం ధన్యమవుతుంది అని ఆలోచించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈయన తెరకెక్కించే ప్రతి సినిమా కూడా సోషియో ఫాంటసీ నేపథ్యంలో సమాజానికి ఉపయోగపడే విధంగా చాలా అద్భుతంగా సినిమాలను తీర్చిదిద్దుతూ ఉంటారు. ముఖ్యంగా ఈయన దర్శకత్వంలో సౌందర్య వంటి స్టార్ హీరోయిన్లు సైతం మరింత గుర్తింపును సొంతం చేసుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.. అందుకే అందమైన, సాంప్రదాయబద్ధంగా ఉండే నటీమణులను మాత్రమే తన సినిమాలలో ఎంపిక చేసుకుంటూ ఉంటారు ఎస్వీ కృష్ణారెడ్డి . ఈ క్రమంలోనే సింగర్ సునీతను కూడా తన సినిమాల ద్వారా హీరోయిన్ గా పరిచయం చేయాలని ఆలోచించారట.

Singer Sunitha directly says to director sv krisnareddy..for movie chance
Singer Sunitha directly says to director sv krisnareddy..for movie chance

అయితే ఇదే విషయాన్ని సింగర్ సునీతతో చెప్పగా ఆమె హీరోయిన్ కాదు కదా కనీసం నటిగా కూడా నేను సినిమాలలో నటించాను సార్ అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి మొహం మీద చెప్పేసిందట.. ఇది విన్న అభిమానుల సైతం బిత్తర పోతున్నారు.. నిజానికి సునీత చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఒకసారి వద్దు అనుకుంటే మరొకసారి ఎంతమంది ఫోర్స్ చేసినా ఆమె అందులో చేయడానికి ఇష్టపడదు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ తన స్కూల్ సినిమా కోసం సునీతన హీరోయిన్గా సంప్రదించినా కూడా ఆమె ససిమేరా అన్నది. ఈ క్రమంలోని ఎస్వీ కృష్ణారెడ్డి గారికి కూడా ఆమె నో చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా సునీత పట్టుదలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

మరి సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత సింగింగ్ కాంపిటీషన్ షోలకి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించింది. ఎటువంటి పార్షియాల్టీ లేకుండా ప్రతి ఒక్కరికి సరైన పద్ధతిలో న్యాయాన్ని అందించిన గొప్ప న్యాయ నిర్ణేతగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.. అంతేకాదు తన పాటల ద్వారా ఎన్నో ఎంతోమంది శ్రోతలను మెప్పించడమే కాదు ఎన్నో అవార్డులను సైతం గెలుపొందింది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.