Health Tips : ఈ తీగ మొక్క ఎక్కడైనా కనిపించిందా వెంటనే దాచేయండి.. ప్రయోజనాలు తెలిస్తే వదలరు..!

Health Tips : నిత్యం మనకు తారసపడే ఎన్నో మొక్కలలో తీగజాతి మొక్కలు కూడా చాలానే ఉన్నాయి. ఈ తీగ జాతి మొక్కలలో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న మొక్కలు మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. కానీ మనం వాటిని పిచ్చి మొక్కలుగా పరిగణిస్తూ ఉంటాము. కానీ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ మొక్కల ఔషధ గుణాలు తెలిస్తే మాత్రం అసలు వదలరు.. ఈ క్రమంలో నే ఇప్పుడు చెప్పబోయే ఈ తీగ మొక్క మీకు ఎక్కడైనా కనిపించిందంటే.. వెంటనే దాచేయండి. దీని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. ఇక అదే దూసర తీగ.. దీనిని చీపురు తీగ అని కూడా పిలుస్తూ ఉంటారు.

If u see anywhere in this plant..please don't leave it..
If u see anywhere in this plant..please don’t leave it..

పల్లెటూర్లలో ఉండే చాలామందికి ఈ మొక్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ దూసరతీగ లో ఔషధ గుణాలు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ దూసర తీగ నుంచి తయారు చేసిన ఔషధం డెంగ్యూ పై పరీక్షించగా చాలా చక్కగా డెంగ్యూ జ్వరం తగ్గినట్లు నిరూపణ అయింది. ముఖ్యంగా ఇందులో యాంటీ వైరల్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల డెంగ్యూ పై ప్రాథమిక పరీక్షల్లో చాలా ప్రభావంతంగా పనిచేసిందని సి ఎస్ ఐ ఆర్ శాస్త్రవేత్తలు కూడా తెలిపారు. దూసర తీగ ఆకులను సేకరించి ముద్దగా నూరి రసం తీయాలి. దీనిని ఒక గ్లాసులో పోసి 5 గంటల పాటు కదిలించకుండా అలాగే ఉంచితే జెల్ లాగా తయారవుతుంది. దీనిని పటిక బెల్లంతో కలిపి తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది.

వారానికి రెండుసార్లు ఈ జెల్ తిన్నట్లయితే శరీరంలో వేడి త్వరగా తగ్గిపోతుంది. అంతేకాదు శరీరంలోకి ఇన్ఫెక్షన్స్ , వైరస్ కారక క్రిములు దరిచేరనివ్వకుండా రక్షిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల డయాబెటిక్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. షుగర్ ఉన్నవారికి ఈ ఆకుల కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు స్త్రీ , పురుషులలో హార్మోన్ల సమస్యలు తీర్చి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. సంతానోత్పత్తి సమస్యలు కూడా తగ్గిపోతాయి . అలాగే గజ్జి , తామర, దురద ఉన్నచోట ఈ ఆకుల రసం రాస్తే త్వరగా తగ్గిపోతుంది.