Jabardasth Varsha : వర్ష అమ్మాయి కాదంట.. జబర్దస్త్ టాప్ కమెడియన్ కామెంట్స్ వైరల్..!

Jabardasth Varsha : ఒకప్పుడు సుధీర్ రేష్మి జంట జబర్దస్త్ లో ఎంత ఫేమస్ అయిందో.. ఇప్పుడు ఆ రేంజ్ లో కాకపోయినా వర్ష ఇమ్మానుయేల్ కాస్త పాపులారిటీని సొంతం చేసుకున్నారు.. సోషల్ మీడియాలో కూడా వీళ్ళ జోడికి ఫన్నీ కామెంట్స్ తో ట్రోల్ చేస్తూ ఉంటారు.. తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయింది. అందులో ఇమ్మానుయేల్ వర్ష అసలు అమ్మాయే కాదు అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..

jabardasth-latest-promo-imanuel-comments-varsha-not-a-girl
jabardasth-latest-promo-imanuel-comments-varsha-not-a-girl

ఈ వారం జరగనున్న జబర్దస్త్ స్కిట్స్ అన్నింటికీ సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అందులో భాగంగా రాజు రాణిల గెటప్ లో వర్ష ఇమ్మానుయేల్ దర్శనమిచ్చారు.. ఇమ్మానుయేల్ వర్షను ఎత్తుకొని ఒక డ్యుయట్ కూడా వేస్తాడు.. మహారాజా నేనుండగా మీరు మరో ఆడదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారు అని వర్ష ఇమ్మానుయేల్ ప్రశ్నిస్తుంది.. దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే నువ్వు ఆడదానివి కాదని తెలిసింది అని ఇమ్మానుయేల్ పంచ్ వేస్తాడు.. ఏంటి నేను ఆడదానిని కాదా అంటూ వర్ష ఫేసులో ప్రశ్నార్ధకం కనిపిస్తుంది..

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టిఆర్పి రేటింగ్ కోసం ప్రోమో వైరల్ అవ్వడం కోసం ఇలాంటివి స్కిట్లో భాగం చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదేమైనా కానీ ఇమ్మానుయేల్ రాను రాను వర్షపై మితిమీరిన కామెంట్స్ చేస్తున్నాడు అన్నది మాత్రం వాస్తవం అని వర్ష ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఇది స్కిట్ లో భాగమా కాదా అనేది చూడాలి.