Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతా పేరు మీద ఏ ఎన్ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.. మహేష్ రెస్టారెంట్లో వంటకాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి మహేష్ అభిమానులు కూడా దీటుగా జవాబిస్తున్నారు.. ఇతర రెస్టారెంట్లో పోల్చి చూస్తే బెటర్ గానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు..

హైదరాబాదులోని ఖరీదైన ఏరియాలో ఈ రెస్టారెంట్ ను ఓపెన్ చేశారని.. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చయిందని మహేష్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ రెస్టారెంట్ మెయింటెన్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని.. ఈ రెస్టారెంట్లో పని చేసే వాళ్లకు కూడా వేతనాలు ఎక్కువగానే ఉంటాయని అభిమానులు తెలిపారు. ఇతర హోటల్ లతో ఈ రెస్టారెంట్ ను పోల్చవద్దని మహేష్ తను సంపాదించిన డబ్బులు ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని గుర్తుంచుకోవాలని ఫ్యాన్స్ గుర్తు చేశారు .
ఇతర రెస్టారెంట్లతో రేట్లు చూసి కామెంట్స్ చేయాలని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. మహేష్ సెలబ్రిటీ కాబట్టే ఆయన రెస్టారెంట్ గురించి కామెంట్లు చేస్తున్నారని. వేరే వాళ్ళ రెస్టారెంట్ అయితే రేట్ల గురించి ఇలా కామెంట్ చేసేవారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇష్టమైన వాళ్ళు తింటారని కష్టమైన వాళ్ళు మానుకుంటారని.. తన రెస్టారెంట్లో కచ్చితంగా తినాలని మహేష్ కానీ నమ్రత కాని ఎవరిని బలవంతం చేయలేదు కదా అని ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి దీటుగా సమాధానం చెబుతున్నారు.