Pushpa 2 : పుష్ప 2 నుంచి లీకైన ఈ డైలాగ్ ఆ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటుందా.!?

Pushpa 2 :  అల్లు అర్జున్ ను ఐకానిక్ స్టార్ గా మార్చేసిన సినిమా.. టాలీవుడ్ హీరో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా పుష్ప.. భారీ అంచనాలు నడుమ విడుదలైన పుష్ప పార్ట్ 1 ఊహించని స్థాయిలో హిట్ అయింది.. ఇప్పుడు అందరూ చూపులు పుష్ప 2 పైనే ఉన్నాయి.. తాజాగా ఈ చిత్రం నుండి ఓ డైలాగ్ పవర్ ఫుల్ డైలాగ్ లీకైంది..

Allu Arjun Pusha 2 movie intresting dialogue leaked
Allu Arjun Pusha 2 movie intresting dialogue leaked

అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కు వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. పులి నాలుగు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం అనే డైలాగ్ లీక్ అయింది.. ప్రస్తుతం ఈ డైలాగ్ నెట్టింట వైరల్ అవుతుంది.. పుష్ప పార్ట్ వన్ లో తగ్గేదేలే డైలాగ్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి పార్ట్ 2 లో రానున్న ఈ డైలాగ్ అదే రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకుంటుందా? సినిమాపై అంచనాలను పెంచేస్తుందా అనేది చూడాలి..

ఇక్కడ అందరి ప్రశ్న ఏంటంటే తగ్గేదేలే డైలాగ్ ఒకే ఒక్క వర్డ్ లో సెట్ అయింది కాబట్టి అందరూ ఈ డైలాగ్ ని ఫాలో అయ్యారు. పుష్ప పార్ట్ 2 లో లీకైన డైలాగ్ ఒక లైన్ ఉంది. ఇది మిగతా భాష వాళ్ళు చెప్పడానికి కాస్త కష్టం అవుతుంది. అదే సింగిల్ లైన్ డైలాగ్ అయితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. మరి నిర్మాతలు ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ఈ నెల 16వ తేదీన ఈ డైలాగ్ తోనే పుష్ప 2 గ్లింప్స్ రానుందని సమాచారం. పుష్ప 2 చిత్రం 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మైత్రి నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు..