Bigg Boss 6 Telugu : ఇనయ ఎలిమినేషన్ పై అన్ని వేల ట్వీట్స్..! బిగ్ బాస్ ను ఏకిపారేస్తున్నారు.!

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో అనూహ్యంగా ఇనయ ఎలిమినేట్ అయింది. ఇంట్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకుంది.. బిగ్ బాస్ టీం కావాలని నిర్ణయాలు హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారని.. ఇనయ కు ఎక్కువగా ఓట్లు వేశారని నేటిజన్ల వాదన.. అంతేకాదు ఇనయ అన్ ఫైర్ ఎలిమినేషన్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు..

tweets on inaya elimination of big boss 6
tweets on inaya elimination of big boss 6

టాప్ త్రీ కంటెస్టెంట్ అయినయాను ఎలిమినేట్ చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో దావనంలా వ్యాపించింది. ఇదెంతవరకు నిజమో తెలియదు కానీ ఇనయ ఫాన్స్ ఘోరంగా హర్ట్ అయ్యారు. ఒక్క ఇనయా ఫ్యాన్స్ మాత్రమే కాదు బిగ్ బాస్ వీక్షించే ఎంతోమంది ఫినాలేలో ఉండాల్సిన కంటెంట్ ని సడన్ గా హౌస్ నుంచి పంపించడం ఏంటని షాక్ అవుతున్నారు. వేరే వాళ్లను సేవ్ చేయడం కోసం ఇనయాను బలి చేశారని ఆగ్రహానికి లోనవుతున్నారు. ఫలితంగా ట్విట్టర్లో ఇనయ అన్ ఫైర్ ఎలిమినేషన్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు 55 వేలకు పైగా ట్వీట్ లతో ట్విట్టర్ హోరెత్తిపోతుంది.

ప్రేక్షకుల ఓట్ల అంటే లెక్క లేదా ఇప్పటికే షో ఫ్లాప్ అవుతూ వస్తుంది. ఇంకా ఇనాయ ను పంపించేసి హౌస్ ను ఇంకా చండాలం చేశారు. మగవాళ్లకు గట్టి పోటీని ఇచ్చిన లేడీ టైగర్ ఇనయ కనీసం ఫినాలే లో కూడా అడుగుపెట్టనీకుండా ప్లాన్ చేసి పంపించేస్తారా.. రియాలిటీ షోలో కూడా ఇన్ని పాలిటిక్స్ జరుగుతున్నాయా అంటూ నేటిజన్స్ బిగ్ బాస్ పై నిప్పులు చెరుగుతున్నారు.