Intinti Gruhalakshmi 12 oct Episode : తులసి ఇచ్చిపడేసిందిగా.!? రేపటికి సూపర్ ట్విస్ట్ సిద్ధం..!

Intinti Gruhalakshmi 12 oct Episode :  ఏమ్మా అనసూయ అందరి ఇళ్ల వైపు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తావు.. ఇప్పుడు మీ ఇంట్లో జరుగుతుంది ఏంటి తులసి అందరి ముందే ఇలా ప్రవర్తిస్తుంది అంటే.. ఇక ఏకాంత సమయంలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయినా ఇలాంటి వాళ్ళకి కాలనీలో ఉండే హక్కు లేదు అని అక్కడికి వచ్చిన కాలనీ వాళ్లు తులసి నీ నీతిగా పద్ధతిగా ఉండమని చెప్పమని అనసూయమ్మతో అంటారు.. అనసూయమ్మ తిరిగి వాళ్లపై గొడవ పడుతుంది.. వాళ్ళని కొట్టబోతుండగా అత్తయ్య అని తులసి అంటుంది. ఇదంతా నీ వల్లే జరిగింది అని అనసూయమ్మ తులసిని అరుస్తుంది..!!

నేనేం తప్పు చేశాను అని తులసి అంటుంది.. అనసూయమ్మ సామ్రాట్ ను చెడా మడా వాయిస్తుంది.. నీ వల్లే ఈ సమస్యలన్నీ అంటుంది.. అయిపోయింది కదా ఆటపాట నీ కోరిక తీరింది కదా ఇక్కడ నుంచి బయలుదేరు అని సామ్రాట్ తో అనసూయమ్మ అంటుంది.. నేను ఇక్కడకు రాకుండా ఉండాల్సింది అని సామ్రాట్ అంటాడు.. అందుకే నేను మీకు ముందుగానే చెప్పి బ్రతిమిలాడను తులసిని ఆఫీసులో నుంచి తీసేయమని తీశావు.. కానీ ఏం ప్రయోజనం మళ్ళీ ఇక్కడికి కూడా దాపరించావు అని అనసూయమ్మ సామ్రాట్ ని తిడుతుంది.. అనసూయమ్మ నిజస్వరూపం తెలుసుకుని తులసి కూడా అనసూయమ్మ పై విరుచుకుపడుతుంది..

intinti-gruhalakshmi-12-oct today full episode
intinti-gruhalakshmi-12-oct today full episode

మా మనసుల్లో మా స్నేహం లో ఎలాంటి దురుద్దేశం లేదు.. ఉన్న కల్మషం అంత నీ మనసులో మీ ఆలోచనల్లో ఉంది అని సామ్రాట్ అంటాడు.. ఆడ, మగ మధ్య ఇలాంటి స్నేహాలు అమెరికా లాంటి దేశాలలో ఉంటాయేమో కానీ ఇక్కడ కాదు అని అనసూయమ్మ అంటుంది.. పెళ్లి తర్వాత ఆడదానికి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు.. స్నేహితులుగా ఉండకూడదా.. విడాకుల తీసుకున్న ఆడదానికైనా కళంకం.. తీసుకున్న మగవాడికి ఎలాంటి కలంక ఉండదా అని తులసి నిలతీస్తుంది..

అసలు నీలాంటి వాళ్ళు కాలనీలో ఉండే హక్కు లేదు అని తులసిని చూస్తూ కాలనీ వాళ్ళందరూ అంటారు.. నందు కూడా పెళ్లి అయిన తర్వాత లాస్యను తీసుకుని ఏ టైంలో ఆ పడితే ఆ టైంలో మా ఇంటికి వచ్చేవాడు తనతో పెళ్లికాకముందే.. ఏకాంతంగా ఒకే రూమ్లో ఉన్నారు.. అప్పుడు మీకేం నందుని చూస్తే తప్పుగా అనిపించలేదా.. ఆరోజు మీరు నందుని ఇలాగే నిలదీయాలని మీరు అనుకోలేదని తులసి నిలదీస్తుంది.. మా స్నేహం లో ఎలాంటి కల్మషం లేదు. సామ్రాట్ గారికి నాకు మధ్యన ఉంది కేవలం వ్యాపార భాగస్వామ్యం మాత్రమే.. మేమిద్దరం మంచి స్నేహితుల మాత్రమే సామ్రాట్ గారు ఏ విషయం గురించి మాట్లాడడానికైనా ఎప్పుడైనా మా ఇంటికి వస్తారు.. కాఫీ తాగడానికి వస్తారు .. భోజనం చేయడానికి వస్తారు .. అవసరం ఉన్న వస్తారు.. అవసరం లేకపోయినా వస్తారు
.. అని తులసి ఉన్న విషయాన్ని కొండల బద్దలు కొట్టి చెపుతుంది.. అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు .. ఇక తులసి తన కుటుంబం తో కలిసి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది..

అరేయ్ సామ్రాట్ ఎందుకు రా ఏడుస్తున్నావు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడుగుతాడు.. ఇవి ఆనందభాష్పాలు బాబాయ్.. కన్నీళ్లు కావు.. అనసూయమ్మ గారు చెప్పినట్టు నేను చేసినందుకు తులసి నన్ను ఎలా దోషుల చూస్తుందోనని నేను బాధపడ్డాను.. కానీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదని తులసి అందరి ముందు చెప్పింది బాబాయ్.. నా స్నేహం లో ఉన్న నిజాయితీ ఏంటో కుండ బద్దలు కొట్టినట్టు అందరి ముందు చెప్పింది బాబాయ్.. ఇప్పుడు కాదురా.. తను ప్రెస్ మీట్ లోని చెప్పింది నీకు అర్థం కాలేదేమో అని వాళ్ళ బాబాయ్ అంటాడు అప్పుడు చెప్పడం కాదు బాబాయ్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి ముందు క్రిస్టల్ క్లియర్ గా చెప్పేసింది.. కాలనీ వాళ్ళందరి ముందు చెప్పి వాళ్ళ అందరితో చప్పట్లు కొట్టించుకుంది తులసి.. ఇది కదా బాబాయ్ నాకు కావాల్సింది.. ఇది కదా బాబాయ్ నేను కోరుకుంది అని సామ్రాట్ అందంగా అంటాడు.. ఇన్నాళ్లు నాది ఒంటరి జీవితమే నా గురించి నేను ఆలోచించకుండా బ్రతికేస్తున్నాను.. కానీ నాకోసం ఈరోజు చుట్టూ ఉన్న సమాజంతో పోరాడుతుంది బాబాయ్ ఒక మంచి స్నేహితుడి కోసం.. చాలా భయపడ్డాను బాబాయ్ అందరి ముందు అవమాన పడాల్సి వస్తోంది ఏమో అని అనుకున్నాను.. ఏదైతే అది అయ్యింది అని తెగించి మాట్లాడాను బాబాయ్ తులసి గారు నన్ను సపోర్ట్ చేశారు.. ఈరోజు నాకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది అని సామ్రాట్ అంటాడు.. ఆత్మవిశ్వాసం అంటే ఇది మనం ఎదగాలి అంటే ఆ మాత్రం తెగింపు ఉండాలి.. తులసి తెగింపు కాదు నీ తెగింపు గురించి చెప్పు ఈసారి సమస్య ఎదురైతే తాబేలు లాగా తల లోపలికి ముడుచుకో కదా అని వాళ్ళ బాబాయ్ అంటాడు మాట ఇస్తున్నాను బాబాయ్.. తులసి గారితో కలిసి మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాను అంతే.. అంత తేలిక కాదు.. చాలా యుద్ధాలు చేస్తాను.. నువ్వే చుస్తవుగా అని అంటాడు..

మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన ఫైల్స్ ఏమీ కనిపించట్లేదు ఏమయ్యాయి అని తులసి లాస్య, నందు దగ్గరకు వస్తుంది.. మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన అన్ని వర్క్స్ నేనే చూసుకుంటాను ఇది నా నిర్ణయం కాదు. జనరల్ మేనేజర్ నందు నిర్ణయం అంటాడు. తులసి ఏదో మాట్లాడబోతుండగా.. అప్పుడే నందు అరే అని పెద్దగా అరుస్తాడు.. అప్పుడే సామ్రాట్ వస్తాడు..