Hair Tips : జుట్టు వత్తుగా పెరగాలి అంటే.. ఈ చిట్కా పాటించండి.. వంటింట్లో తయారు చేసుకోవచ్చు!

Hair Tips : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే అనేక రకాల షాంపూలను, ఆయిల్స్ ని వాడుతుంటారు. ఇలాంటివి వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకనగా మార్కెట్లో దొరికే షాంపూలలో, ఆయిల్స్ లలో చాలా రకాల రసాయనాలను కలపడం వలన జుట్టు రాలే సమస్య అధికమవుతుంది. జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నవారు, ఈ చిన్న చిట్కాను పాటించినట్లయితే మీకు మంచి ఫలితం దొరుకుతుంది. ప్రతిరోజూ మనం వాడే వాటిలో ఈ ఆయిల్ ని 2 లేదా 3 డ్రాప్స్ వేసుకొని వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.

కానీ మనం చేసే అతిపెద్ద తప్పు మనం ప్రతిరోజు ఆయిల్ ని రాసుకోము. కానీ ప్రతిరోజు ఆయిల్ ని మన తలకి రాసుకోవడం తప్పనిసరి. మనం రోజు రాసుకునే ఆయిల్ తో పాటు వీటిని కలిపి రాసుకోవడం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగు తుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని మీరు ప్రతిరోజూ ఉపయోగించే నూనెను ఒక స్పూన్ వరకు తీసుకోవాలి. దీనిలో బాదం నూనెను ఒక స్పూన్ తీసుకోవాలి. జుట్టు స్మూత్ అవ్వడానికి బాదం నూనె ఉపయోగపడుతుంది. అంతే కాక జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి సహాయం చేస్తుంది. దీనిలో తరువాత అర స్పూన్ క్యాస్టర్ నూనెను వేసుకోవాలి. జుట్టు రాలడం తగ్గి జుట్టు వత్తుగా పెరగడానికి క్యాస్టర్ ఆయిల్ సహాయపడుతుంది. ఇవే కాకుండా తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది.4 లేదా 5 డ్రాప్స్ రోజ్మేరీ నూనెను వేసి కలుపుకోవాలి.

Hair Tips on Follow this tip
Hair Tips on Follow this tip

ఈ ఆయిల్ జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో బాగా పని చేస్తుంది. అంతేకాక జుట్టు కుదుళ్ళకు బలాన్ని ఇస్తుంది. ఈ ఆయిల్ ప్రతిరోజూ మన తలకి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు రోజు రాత్రి హెయిర్ సీరమ్ ను అప్లై చేయాలి. ఈ సిరం ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మీరు ప్రతిరోజు వాడే షాంపూను ఒక కప్పులోకి తీసుకుని దానిలో 3 లేదా 4 డ్రాప్స్ వేసి కలిపి కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి ఈ షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.ఇప్పుడు పైన పేర్కొన 3 టిప్స్ ని ప్రతిరోజూ పాటించినట్లయితే జుట్టు రాలడం తగ్గుతుంది. ఇటు వంటి హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అయినట్లయితే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. మనం హోమ్ మేడ్ షాంపూపి వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎపెక్ట్స్ రావు. అంతేకాకుండా ఈ షాంపూని చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్ద వాళ్ళ వరకు దీనిని వాడవచ్చు.