Health Tips : మన ఇంట్లో పెరిగే కరివేపాకుతో ఇంత మంచి ఉందా .. తెలిస్తే డైలీ పచ్చడి చేస్తారు !

Health Tips : కరివేపాకు.. కరివేపాకును ఎక్కువగా పోపులో వేస్తారు.. కానీ ఎవరు కూడా ఆ పోపులో ఉన్న కరివేపాకును తినడానికి ఇష్టపడరు.. ఇక పోపులో ఉన్న కరివేపాకుని తీయకుండా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యుల సైతం చెబుతున్నారు ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో కూడా కరివేపాకుకి ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. కరివేపాకు ఆహార పదార్థాలకు మంచి రుచిని ఇవ్వడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక కరివేపాకులో వివిధ రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా నేరుగా నాలుగు ఆకులు తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇక నిత్యం కరివేపాకు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

కరివేపాకు శరీరంలో పేరుకుపోయిన LDL కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. తద్వారా ఊబకాయంతో పాటు అధిక రక్తపోటు, గుండె సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహంతో బాధపడేవారు నిత్యం తినడం వల్ల రక్తంలోని చక్కర స్థాయి ని క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదు కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఈ మధ్యకాలంలో వయసు పెరిగే కొద్దీ కంటి చూపు కూడా సన్నగిల్లుతుంది. అలాంటి పెద్దవారు కూడా కరివేపాకుని తినడం వల్ల కంటి సంబంధి సమస్యలను దూరం చేసుకోవచ్చు. కరివేపాకు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

Health Tips on curry leaves
Health Tips on curry leaves

అలాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.అధిక రక్తపోటు, రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది. కరివేపాకు కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాదు సౌందర్య ప్రయోజనాలను కూడా పెంపొందిస్తుంది. జుట్టు రాలడం, తెగిపోవడం , చిట్లిపోవడం, చుండ్రు.. లాంటి మొదలగు జుట్టు సమస్యలతో బాధపడుతుంటే కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించి.. వడకట్టి.. ఆ నూనెను వారానికి రెండు సార్లు తలకు అప్లై చేస్తూ ఉంటే జుట్టు సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి. కరివేపాకు చర్మపు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. వృద్ధాప్య చాయాలను దూరం చేసి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.