Vastu Tips : ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రావట్లేదా ? మీకోసమే ఈ ట్రిక్ .. ఇంట్లో ఇవి పెట్టండి వెంటనే !

Vastu Tips : జీవితంలో ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా సరే అదృష్టం కలిసి రాక.. ఎన్నో ఆర్థిక సమస్యలు.. ఏ పని చేపట్టినా విఫలం చెందడం.. పైగా మానసికక్షోభ.. కుటుంబంలో గొడవలు..భార్యాభర్తల మధ్య కలహాలు ..ఇలా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం కష్టపడిన దానికి ప్రతిఫలం లభించాలి అంటే కేవలం మన కష్టం ఒకటే సరిపోదు.. అదృష్టం కూడా కలిసి రావాలి.. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఇంట్లోకి డబ్బు వస్తుంది. ముఖ్యంగా ఫెంగ్ షుయ్ చైనా వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వస్తువులను ఉంచడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు రెండూ లభిస్తాయి. ఇక మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే.. ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం వస్తువులను ఇంట్లో ఎలా ఉంచితే లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

3 కాళ్ల కప్ప : ఇంట్లో మూడు కాళ్ల కప్పను ఉంచుకోవడం వల్ల శుభప్రదం అని ఫెంగ్ షుయ్ నిపుణులు తెలుపుతున్నారు. మీరు కూడా మూడు కాళ్ల కప్పను తీసుకొచ్చి దాని నోట్లో నాణేలు ఉంచండి . ఇక ఈ కప్పను ఇంటి ముఖ ద్వారం దగ్గరలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది.

Vastu Tips on No matter how hard you work, luck will not come
Vastu Tips on No matter how hard you work, luck will not come
లాఫింగ్ బుద్ధ : చైనా వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ కి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది . లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. దుఃఖం, ఒత్తిడి దూరం అవుతాయి.. లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది.

క్రిస్టల్ : ఇంటికి ఈశాన్య దిశలో క్రిస్టల్ స్పటికాలని ఉంచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఆఫీసులో అయితే నార్త్ , వెస్ట్ దిశలో తెలుపు రంగు స్పటికాలను ఉంచాలి.

తాబేలు : తాబేలు కూడా చాలా పవిత్రమైనదిగా చైనీస్ వాస్తు శాస్త్రం ప్రకారం పరిగణిస్తారు. తాబేలు లక్ష్మీదేవికి చిహ్నంగా హిందూమతంలోనూ పరిగణిస్తారు. అలాంటప్పుడు ఇంటికి లేదా కార్యాలయానికి ఉత్తర దిశలో తాబేలు తీసుకొచ్చి పెట్టడం వల్ల ఆ ఇంటి పెద్ద యొక్క పురోగతి పెరుగుతుంది.

చైనీస్ నాణేలు : మూడు చైనీస్ నాణేలను తీసుకొని.. ఎర్రటి దారం లేదా రిబ్బన్ పై కట్టి ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో సంపద , ఆనందం వెల్లివిరుస్తుంది అని చెబుతారు.