Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో తక్కువగా అనిపిస్తుంది.. అంతలా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు ఈ సీరియల్ని.. అదే రీతిలో చక్కటి చక్కటి కంటెంట్ను అందిస్తూ.. అద్భుతమైన పంచ్ డైలాగ్స్ తో పాటు నవ్వించే పాత్రలను సృష్టిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నిర్మాతలు.. ఈ సీరియల్ వచ్చే వారం లో ఏం జరుగుతుందో ప్రత్యేక కథనం మీకోసం..!!

లాస్య ను పెళ్లి చేసుకున్న నందు.. తులసి కి దూరం అవ్వలేక తనకు ఎదురవుతున్న ప్రతి సిచువేషన్ లో తులసిని గుర్తుచేసుకుంటూ పెళ్లి బంధం తో దూరమైనప్పటికీ.. ప్రేమ అనే బంధంతో తనకి ఇంకా దగ్గరవుతున్నాడు.. ఎట్టకేలకి లాస్య నందుని భర్తగా సొంతం చేసుకుంది కానీ.. తన మనసులో స్థానం సంపాదించుకోలేకపోతుంది. ఇక ఇంట్లో తనకు స్థానం లేదన్నా విషయాన్ని ప్రతి సందర్భంలో ఇంట్లో వారందరూ గుర్తు చేస్తూనే ఉంటారు.. నందుని తులసి ఆలోచనల తో పాటు చేతి వంటకి కూడా దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో.. కొత్త పని మనిషి పాత్రలో వారెవ్వా వసంతం ను రంగంలోకి దింపారు డైరెక్టర్స్. నిన్న చూసిన ఎపిసోడ్ ప్రకారం.. ఈ సీరియల్లో ఈ పాత్ర హైలెట్ గా నిలవనుంది. ఈ వారం మొత్తం వసంత క్యారెక్టర్ తో ఇంటింటా నవ్వులు పూయించనున్నారు..

మరోవైపు నందుని ధైర్యం కోల్పోవద్దు అంటూ నీ ఆత్మ విశ్వాసాన్ని నమ్మకం అంటూ చదువులేని నేనే ఇంత సాధించినప్పుడు చదువుకున్న నువ్వు ఎంత సాధించగలవు అని తనకు ధైర్యాన్ని నురిపోస్తుంది.. అదే ధైర్యంతో లాస్య వద్దన్న కంపెనీకి ఇంటర్వ్యూ కి బయలుదేరుతాడు నందు. పులికి తోకలా బతకడం కంటే పిల్లికి తలలా బతకడం దర్జాగా ఉంటుందని లాస్యకి షాక్ ఇస్తాడు. ఇక ఆ కోపంతో లాస్య తులసి పై పంచ్ లు పేలుస్తుంది. ఇప్పటికైనా ఇంట్లో వారందరిని మనసులు సొంతం చేసుకో అంటూ తులసి హితబోధ చేయడం మామూలే..
ఈసారి తులసి ఇచ్చిన ధైర్యంతో నందు ఉద్యోగం సంపాదించుకునేట్టే ఉన్నాడు.. ఒకవేళ నందుకు ఉద్యోగం వస్తే తులసిపై నందు కి ఇంకా ప్రేమ పెరుగుతుంది.. తను ఆపదలో ఉన్న సమయాలలో, తనకు ధైర్యాన్ని అందించి తన వెంట ఉన్నందుకు ఇప్పటికే తన మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది.. ఇక లాస్య నందు కి తులసిని దూరం చేయాలని ఎన్ని ప్రణాళికలు రచించినా వేస్ట్.. ఇక కొత్తగా వచ్చిన వారే వసంత తనదైన స్టైల్లో దూసుకెళ్తే అనసూయమ్మ బ్రేకులు వేసే సన్నివేశాలు అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి.. ఈ సన్నివేశాలకు ఇంట్లో వాళ్ళందరూ తోడైతే వచ్చే వారం ఎపిసోడ్ మరో లెవెల్ లో ఉంటుందని అంచనా..