Wrap Food In Newspaper: న్యూస్ పేపర్ లో పెట్టిన ఆహారాన్ని తింటున్నారా..!? ఈ ప్రాణాంతక వ్యాధి రావచ్చు..

Wrap Food In Newspaper: సరదాగా సాయంకాలం కాసేపు బయటకు వెళితే.. రోడ్డు పక్కన కనిపించిన పకోడీ, గారే, మిర్చి బజ్జీ వేడివేడిగా తినాలనిపిస్తుంది.. వాటిని తినడానికి ఎందులో పెట్టి ఇస్తున్నారో కూడా గమనించకుండా తినేస్తుంటాం.. సాధారణంగా మనం బయట తెచ్చుకుని టిఫిన్స్ న్యూస్ పేపర్ లో చుట్టి ఇస్తారు..!! దీనివలన మన ఆరోగ్యానికి జరిగే నష్టం గురించి తెలుసుకుందాం..!!
ఇలా న్యూస్ పేపర్లో చుట్టిన ఆహారం తినడం వల్ల మనకి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. ఈ ఆహార పదార్థాలు ఎంత శుభ్రంగా ఉన్న వాటిని న్యూస్ పేపర్లో చుట్టడం వల్ల అవి నెమ్మదిగా విషతుల్యం అవుతాయని ఫుడ్ అధారిటీ అధికారులు తెలిపారు. న్యూస్ పేపర్ మీద ప్రింట్ చేసే ఇంక్, డైలు ఆహార పదార్థాలకు అంటుకుని వాటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు చెబుతున్నాయి. న్యూస్ పేపర్ పైన ప్రింట్ చేసే ఇంక్ సురక్షితమైనది కాదు. ఎందుకంటే అందులో క్యాన్సర్ కు కారణమయ్యే నాఫ్తలమైన్, బెంజి డైన్, 4 అమైనో బైఫినైల్, ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి హానికరమైన రసాయనాలు ఉన్నాయి. అందువలన ఇందులో ఉన్న ఆహార పదార్ధాలకు ఆ ఇంక్ అంటితే మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే పాడుచేసుకున్న వాళ్ళం అవుతాం.
పేపర్ మీద కథనాలు ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఇంక్ లో గ్రాఫైట్ ఉంటుంది. కాగితం పొడిగా ఉన్నంతవరకు అంటే న్యూస్ పేపర్ చదివితే ఏమి కాదు. కానీ పేపరు ఏ మాత్రం తడిగా అయినా అందులో తినుబండారాలు పెట్టి వాటిని నూనె వలన తినే ఆహార పదార్ధాలకు అంటితె మాత్రం.. అది మన శరీరంలోకి చేరి మూత్రపిండాలు, కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. దీనితోపాటు ఎముకలు, కణజాల ఎదుగుదలను కూడా నిరోధిస్తుంది. మన శరీరం లోకి వెళ్లిన విష వ్యర్థాలన్ని మన మలం ద్వారా బయటకు వస్తాయి. కాకపోతే గ్రాఫైట్ అలా బయటకు రాకుండా మన శరీరంలోనే ఉండి పోయి మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందువలన న్యూస్ పేపర్లో చుట్టిన ఆహారపదార్థాలను అసలు తినకండి.