Tea: ఈ పూల టీ రుచి అమోఘం..!! ప్రయోజనాలు బోలెడు..!!

Tea: సాధారణంగా మందారం పూలను పూజకు, అలంకరణకు, నూనె తయారీకి ఉపయోగిస్తారని తెలిసిందే.. మనం అక్కడ వరకే తెలుసుకుంటే ఈ ప్రయోజనాలను కోల్పోతాము..!! మందారం పూలు లో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.. ఈ పూలతో టీ తయారు చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి..!! ఇంతకీ ఆ టీ ఎలా తయారు చేసుకోవాలో..!? ఎప్పుడు తాగలో వివరంగా తెలుసుకుందాం..!!
మందారం పూలను ఎండలో ఎండిబెట్టిన తరువాత ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఒక కప్పు నీటిలో ఒక మందారం పువ్వును వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. ఇందులో రుచికోసం కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకోవాలి. వేడివేడిగా మందారం టీ తాగడానికి రెడీ.. మందారం టీ లో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. డయాబెటిస్ తో బాధపడే వారికి దీనిని చక్కటి హెర్బల్ టీ గా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు పరగడుపున ఈ టీ తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
ఈ పూల టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. తద్వారా క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో ఈ టీ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ మూడు కప్పుల మందారం టీ తాగడం వలన రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. ఈ పూల టీ తాగితే లివర్ సమస్యలు తగ్గుతాయి. లివర్ లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. మందారం టి బరువు తగ్గడానికి చక్కగా పనిచేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఉంది. తద్వారా బరువు తగ్గుతారు.