Karthika Deepam: టీవీ సీరియల్ లో టాప్ రేటింగ్ లో.. బుల్లితెర ప్రేక్షకులకు అల్టిమేట్ వినోదాన్ని అందిస్తున్న సీరియల్ కార్తీకదీపం అనడంలో సందేహం లేదు..!! రోజుకు మలుపు తిప్పుతూ ఈ సీరియల్ ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తుంది.. టీవి ఈవెంట్స్ కూడా రాని రేటింగ్ ఈ సీరియల్ కు వస్తుందంటే.. ఈ ధారావాహిక కు ఆదరణ ఏ రేంజ్ లో ఉందో చెప్పనవసరం లేదు..!! ఇంతలా మన్ననలు పొందుతున్న ఈ సీరియల్ వచ్చే వారం లో ఏం జరగనుందో ఇప్పుడు చూద్దాం..!!
ఇంటి నుంచి దూరంగా వచ్చిన కార్తీక్, దీపాలు.. రుద్రాణీ తో గొడవ పడి మరీ ఆ ఇంట్లో ఉండడం, దీప ఆమెనే కొట్టడం.. గంగరాజు వాళ్ళ బాకీ తీరుస్తానని మాట ఇవ్వడం.. ఒకవేళ తీర్చకపోతే వారి బిడ్డలలో ఒకరిని రుద్రాణీ కి ఇస్తానని కార్తీక్ సంతకం పెట్టడం.. ఆ విషయం తెలుసుకున్న దీపా అప్పు తీర్చడానికి పిండి వంటలు తయారు చేసి అమ్మడానికి మార్కెట్లోకి వెళ్లగా అంతకు ముందే ఇంద్రాణి తక్కువ రేటుకి వాటిని ఊరిలో ఉన్న షాపులకు వేస్తుంది.. ఏం చేయాలో తెలియాక పాలుపోక దీప ఉంటే.. ఒక హోటల్ కి వెళుతుంది హోటల్ యజమాని దీప పిండి వంటలు రుచి చూసి మా హోటల్లో వంట చేస్తావా అని అడుగుతుంది అడుగుతాడు.. అది విన్న దీప సంతోషంగా చేస్తా అంటుంది..
అదే హోటల్లో కార్తీక్ పని చేస్తున్న విషయం తెలుసుకుంతుంది హోటల్ యజమాని తో దీపా డీల్ కుదుర్చుకుని ఎట్టకేలకు రుద్రాణి అప్పు ని సమయానికి తీర్చి వేస్తుంది.. వారి ఇద్దరి బిడ్డలను కాపాడుకోవడంతో పాటు.. వారు దత్తత తీసుకున్న గంగరాజు బిడ్డను కూడా కాపాడుకుంటుందని అంచనా.. మరోవైపు సౌందర్య తన భర్తను తీసుకొని ప్రకృతి వైద్యశాల కు వెళుతుంది.. బస్తీ లో మౌనిత రచించిన కొత్త ప్రణాళికలను విన్నీ ద్వారా యధావిధంగా అప్లై చేస్తుంది.. వారి ప్లాన్స్ కు బస్తీవాసులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలంటే.. వచ్చేవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..